ఒకప్పటి స్టార్ హీరో ఆస్తులు వేలం

కెప్టెన్ విజయకాంత్ అంటే తెలియని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఉండరు. 1980 నుండి 2004ల వరకు అనేక హిట్ సినిమాలు చేసి తమిళ ప్రేక్షకుల్ని తన నటనతో ఉర్రూతలూగించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన తమిళ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు. 2010 తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికే పరిమితమైన ఆయన రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అంతేకాదు ఆయనకు అప్పుల భారం కూడా బాగా పెరిగిందట.

అప్పులిచ్చిన బ్యాంకులు ఆయన ఆస్తుల్ని వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి. సాలిగ్రామంలో ఉన్న విజయకాంత్ ఇల్లు, తేని జాతీయ రహదారిలో ఉన్న ఆయనకు చెందిన ఆండాళ్ అళగర్ ఇంజనీరింగ్ కళాశాలను బ్యాంకు వారు జూలై 26న వేలం వేయనున్నారు. ఇకపోతే ఆయన వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్ముగ పాండియన్ ఇప్పుడిప్పుడే కెరీర్లో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు.

Exit mobile version