ఇప్పటి సినిమాలు నాగరికతను దెబ్బ తీస్తున్నాయట !

నందమూరి తారక రామారావు, అంజలి దేవి, కాంతా రావు ప్రధాన పాత్రలలో దర్శక ద్వయం సి.పుల్లయ్య, సి ఎస్ రావు తెరకెక్కించిన అజరామర రామ కావ్యం “లవకుశ”. తెలుగు చలన రంగంలో ఎప్పటికే కీర్తింపబడే అద్భుత చిత్రంగా “లవకుశ” పేరు గాంచింది. ఐతే ఈ చిత్రంలో లవకుశులుగా టైటిల్ రోల్స్ లో నటించిన చిన్నారులు నాగరాజు, సుబ్రమణ్యం కూడా అద్భుతంగా నటించి చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించారు.

ప్రస్తుతం 70 పదుల వయసులో ఉన్న ఈ ఇద్దరు ఓ ఇంటర్వ్యూలో సమకాలీన సినిమాల పై తమ అభిప్రాయం తెలిపారు. నేటి చిత్రాలు మన నాగరికతను దెబ్బ తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన యువతను తప్పుదోవ పట్టించేలా చేస్తోందన్నారని వాపోయారు. సీరియళ్లు, సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోందని.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలనాటి సినిమాల్లో హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టు ఉండేదని.. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సినిమాలు వస్తున్నాయని అన్నారు.

Exit mobile version