సిల్క్ స్మిత మంచి నటి అంటున్న మలయాళ దర్శకులు


హిందీలో విద్య బాలన్ నటించిన డర్టీ పిక్చర్ చిత్రం విడుదలకి సిద్ధమై ఎన్నో విమర్షణలు ఎదుర్కొంటోంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా, సిల్క్ స్మిత హీరోయిన్ గా వచ్చిన ‘అధర్వం’ చిత్రానికి దర్శకుడు డెన్నిస్ జోసెఫ్.నేను పని చేసిన గొప్ప నటీ నటుల్లో సిల్క్ స్మిత ఒకరని ఆమె ఎంతో క్రమశిక్షణ కలిగిన నటి అని ఆయన అన్నారు.ఆమె నిస్సంకోచంగల నటి మరియు తెలివైనది అని షూటింగ్లో అందరితో బాగా మాట్లాడేది అని తెలిపారు.

తరుచూ ఆమెకి వాంప్ తరహా పాత్రలు రావడం వలన ఆమెలోని నటిని అవి చంపేశాయి అని లయనమిన్ చిత్రానికి దర్శకత్వం వహించిన తులసీదాస్ అన్నారు. సిల్క్ స్మితకి సౌత్ లో మంచి క్రేజ్ ఉండటం ముఖ్యంగా మలయాళంలో ఇంకా ఎక్కువ అభిమానులు ఉండటం వలన డర్టీ పిక్చర్ చిత్రాన్ని తెలుగు, తమిళ మరియు మలయాళం లాంటి భాషల్లో డబ్ చేస్తున్నారు.

Exit mobile version