సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా రాజమౌళి డ్రెస్సింగ్ స్టైల్

రాజమౌళి అడుగు వేస్తే చాలు మీడియా అటెన్షన్ మొత్తం అటే ఉంటుంది. రాజమౌళి మాటలు, చేతలు ఎప్పుడూ సెన్సషనే. స్టార్ హీరోలకు మించిన పాపులారిటీ ఆయన సొంతం. కాగా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రికార్డ్స్ నిలకొల్పిన బాహుబలి చిత్రాలు ఆయనకు మరింత కీర్తి తెచ్చిపెట్టాయి. అలాగే ఇప్పటికే అనేక ప్రపంచ వేదికలపై ప్రదర్శించబడిన బాహుబలి ప్రఖ్యాత లండన్ ఆల్బర్ట్ థియేటర్ లో ప్రదర్శనకు అర్హత సాధించింది. మొన్న 19వ తేదీన బాహుబలి బిగినింగ్ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించారు.

ఐతే ఈ షోకి రాజమౌళి తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పట్టు పంచె, పట్టు కండువా మరియు ఆరెంజ్ కలర్ లాల్చీ ధరించి హాజరవడం ప్రత్యేకత సంతరించుకుంది. ఆయన ఆ గొప్ప వేడుకలో తనదైన వస్తధారణతో ప్రత్యేకంగా నిలిచారు. దీనితో ఆయన వస్త్ర ధారణ గురించి మీడియా ప్రముఖంగా రాయడం జరిగింది. ప్రభాస్, రానా, అనుష్క, ఎం ఎం కీరవాణి మరియు నిర్మాత శోభు యార్లగడ్డ లండన్ వేదికగా జరిగిన ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.

Exit mobile version