పురాణపండ అమోఘ పరిమళాల ‘ శ్రీపూర్ణిమ’ ను బహూకరించిన సన్నిధానం శాస్త్రి

Puranapanda Srinivas Sri Poornima Book

రాజమహేంద్రవరం ; నవంబర్; 19

రాజమహేంద్రవరం పేరు వింటే చాలు … కొమ్మలనిండా కవిత్వం విరబూస్తుంది. ప్రతీ ఇంట్లో ఏదో ఒక చరిత్ర నిండే ఉంటుంది. గోదావరి మీద కాలం చేసే మహిమల నాగరికత తేలుతూ మనకి స్వాగతం చెబుతుంది. అలాంటి రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రముఖ పాత్రికేయులు సన్నిధానం శాస్త్రి పేస్ బుక్ మిత్రులతో, కొందరు రాజమహేంద్రవరం ప్రముఖులతో వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ మహోత్సవంలో అందరికీ ‘ శ్రీ పూర్ణిమ ‘ అనే ఒక అద్భుతమైన , పరమాద్భుతమైన బుక్ ని బహూకరించారు. ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ ఈ బుక్ మనకి అందదేమో. అలావుంది ఈ అపురూప గ్రంధం.

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలలో ఈ పుస్తకం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. దేశ దేశాలలో పేరుపొందిన పురాణపండ వారింటి అద్భుతమైన మనిషి, విఖ్యాత రచయిత, వండర్ఫుల్ వక్త పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన ఈ బంగారు పాత్ర మరువలేనిదని , మరపురానిదని పండిత, పామర, ఆధ్యాత్మిక, రాజకీయ, సాహిత్యవేత్తలు గొంతెత్తి చెబుతున్నారు. ఏడువందల యాభై పేజీల ఈ ‘ శ్రీపూర్ణిమ ‘ మహా గ్రంధాన్ని ఉచితంగా ఇవ్వడానికి ఎంత దమ్ముండాలి? … అనే ఆలోచన కన్నా దేవుడు ఎంతగా అనుగ్రహిస్తే పురాణపండ శ్రీనివాస్ కి ఈ శ్రీ పూర్ణిమ అవతరింప చేసే ఆలోచన
వచ్చిందో కదా అనిపిస్తోందంటున్నారు విజ్ఞులు. పురాణపండ శ్రీనివాస్ చాలా చక్కని వక్త. జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నమానవతావాది. పుస్తక రచనలో, సంకలనంలో, ముద్రణా నైపుణ్యంలో , ప్రవాహ శైలీ సొగసుల రచనల్లో చక్కని ప్రయోగాలు చేసి విజయఢంకా మ్రోగించే ఆధ్యాత్మికవేత్త. అన్నింటికంటే ముఖ్యంగా ఏమీ ఆశించని నిస్వార్ధ సేవకుడు. కపటాలు , కల్మషాలు దరిచేరనివ్వని మంచి కవిత్వ ధర్మమర్మజ్ఞుడు.

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా శ్రీనివాస్ బుక్స్ రెప రెపలాడుతూ బంగారు పళ్లెంలో వెండి పుష్పాల్లా కనిపిస్తాయి. బుక్స్ మొత్తం మనం తిరగేసాక పరవశించిపోతాం. సన్నిధానం శాస్త్రి గారు ఎంతోమందికి కార్తీక మాసపు బహుమతిగా అందించిన ఈ పుస్తకం ఎందరినో మరోలోకంలోకి తీసుకెకెళ్లిందని తీసుకున్న వారంతా
చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటివి ఒక్క పురాణపండ శ్రీనివాస్ మాత్రమే చేయగలరంటున్నారంతా. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సన్నిధానం శాస్త్రి స్థాపించిన బ్రౌన్ మందిరంలో జరిగే సాహిత్య , సాంస్కృతిక వేడుకల్లో సైతం విచ్ఛేసిన అతిధులకు కూడా పురాణపండ శ్రీనివాస్ అపూర్వ గ్రంధాలనే బహూకరించడంతో వారంతా ఎంతో ఆనందాన్ని ప్రకటిస్తున్నారు.

ప్రముఖ గాయని పి. సుశీల, ఆంద్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఆంద్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మి పార్వతి , ప్రముఖ సినీనటులు మాగంటి మురళి మోహన్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్, రాజమండ్రి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు వంటి
ఎంతోమంది ప్రముఖులకు పురాణపండ శ్రీనివాస్ ధార్మిక చైతన్య గ్రంధాలను బహూకరించి పుణ్యం మూట కట్టుకుంటున్న సన్నిధానం శాస్త్రి సాహితీ ప్రియులకు చేస్తున్న ఆర్ష ధార్మిక సేవ నిరుపమానం. శ్రీపూర్ణిమ గ్రంధం మాత్రమే కాకుండా పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనల్ని చాలా వెరైటీలను కూడా సన్నిధానం శాస్త్రి పంచుతుండటంపట్ల సంతోషాలు ఎలుగెత్తుతున్నాయి. ఆర్ష ధర్మావలంబనమే జాతికి శ్రీరామ రక్షగా పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలు నిలుస్తున్నాయని మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు గత పదేళ్లుగా చెప్పడం కూడా అనేక చోట్ల కనిపిస్తోంది. ప్రవచన చక్రవర్తి , మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు పవిత్ర హస్తాలతో ఆవిష్కృతమైన ఈ శ్రీపూర్ణిమ మహా గ్రంధానికి ప్రముఖ సినీ నటి, నగరి శాసన సభ్యురాలు ఆర్.కే. రోజా సమర్పకురాలిగా వ్యవహరించడం, తొలిప్రతి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరించడం మెరుపుల మాణిక్యాలమధ్య బంగారు కంకణంలా దర్శనమిస్తోంది.

గోదావరి జిల్లాలకు చెందిన సాహితీ ప్రియులు సన్నిన్ధానం శాస్త్రి , రాజమండ్రి వారి వద్ద ఈ పుస్తకాన్ని ఉచితంగా అందుకునే భాగ్యాన్ని పొందొచ్చు. అంశాల్లోకి వెళితే గత ముఖ్యమంత్రులు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, నారా చంద్రబాబునాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ , ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి…. అంటే ఐదుగురు ముఖ్యమంత్రులచే వరుసగా ఐదు బుక్స్ ఆవిష్కరింపచేసుకున్నడి బహుశా పురాణపండ శ్రీనివాస్ ఒక్కరే అన్నది కూడా ప్రస్పుటమవుతోంది . శ్రీనివాస్ నిరంతర శ్రమైక జీవన సౌందర్యానికి, ప్రజ్ఞకు, మేధకు , నిస్వార్ధ యజ్ఞ భావనకు మనమూ తోదలవ్వాల్సిన సమయం వచ్చిందని విజ్ఞులు అభిప్రాయం పడ్డం సంతోషం. ఇలాంటి పుస్తకాలు బహూకరించిన సన్నిధానం శాస్త్రి సౌజన్యానికి కృతజ్ఞతలు తెలపాల్సిందే. నగరి ఎమ్మెల్యే రోజా విజ్ఞతను, , సంస్కారాన్ని , ధార్మిక సేవనూ రాజకీయాలకు అతీతంగా అందరం అభినందించాలి.

Exit mobile version