‘సాయం చేయాలంటే పెద్ద మనస్సు ఉండాలి. అది తనకు ఉందని నిరూపిస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తన అభిమాని కడప శ్రీను ఆకస్మిక మరణం తరువాత, అతని కుటుంబానికి అండగా నిలబడుతూ ప్రతి నెల ఆ కుటుంబ ఆర్ధిక అవసరాలు తీరుస్తూ.. ఆ కుంటుబానికి పెద్ద కొడుకుగా మారాడు. ఈ లాక్ డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా, సందీప్ కిషన్ కడప శ్రీను తల్లికి డబ్బులను పంపించారు. కడప శ్రీను తల్లికి ఏ అవసరం ఉన్నా.. ఆమెకు అండగా నిలబడుతూ తానూ రీల్ హీరోతో పాటు రియల్ హీరోనని సందీప్ నిరూపించుకున్నాడు.
ఇక ఈ కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయంగా సందీప్ కిషన్ రూ. 3 లక్షలు విరాళాన్ని అందించిన సంగతి తెలిసందే. అదేవిధంగా తన ‘వివహా భోజనంబు రెస్టారెంట్’లో పనిచేస్తున్న 500+ ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలను కూడా సందీప్ కిషన్ ఆర్ధిక సహాయం చేస్తున్నారు.
ఇక `నిను వీడని నీడను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన సందీప్ కిషన్ ప్రస్తుతం `A1 ఎక్స్ప్రెస్` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవన్ కనుకొలను’ దర్శకత్వం వహిస్తున్నారు.
Talented Hero @sundeepkishan is man of his words.After his fan Kadapa Srinu’s sudden death,Sundeep Kishan garu is looking after his mother’s monthly expenses.Even in this lockdown situation, he kept his promise by sending the necessary amount to her.True hero on & off the screen. pic.twitter.com/gvRw0CsD05
— SivaCherry (@sivacherry9) April 8, 2020