డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటించిన చిత్రం “రొమాంటిక్”. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు హీరోయిన్ కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు.
నాది ఢిల్లీ, మాది డాక్టర్స్ ఫ్యామిలీ. నాకు సినిమా రంగమంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఫీల్డ్ కి వచ్చాను. ఇలా డెబ్యూ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్‌స్టా ద్వారా నన్ను చూసి ఒకసారి ఆడిషన్‌కి రమ్మని పూరి కనెక్ట్స్ నుంచి నాకు కాల్ వచ్చిందని, వచ్చి ఆడిషన్ ఇచ్చాను, అంతా ఒకే అవ్వడంతో ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో నేను కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. నా మొదటి చిత్రమే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో చేయడం ఆనందంగా ఉందని, దర్శకుడిగానే కాకుండా పూరి సార్ మనస్తత్వం కూడా నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
నా మొదటి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం వచ్చింది. నా వల్లే కాదే పాటను పాడాను చాలా ఆనందంగా ఉంది. నా సినిమా రెండు రోజుల్లో విడుదల కాబోతోందనే సంతోషం నాలో ఎక్కువైంది. తెరపై నన్ను నేను చూసుకోవాలనే కల నెరవేరుతోంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. రమ్యకృష్ణ గారు, ఆకాష్‌తో కలిసి నటించడం చాలెంజింగ్ గా అనిపించింది. దర్శకుడు అనిల్ గారిని ప్రతీ సీన్ గురించి పదే పదే అడిగేదాన్ని, టోటల్ ఔట్పుట్ చూశాక ఆడియెన్స్‌కు నేను నచ్చుతాను అని అనిపించింది.
ఆకాష్ చాలా మంచి వ్యక్తి. నేను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకున్నాడు. నాకు ఈ చిత్రంలో ఆకాష్ రూపంలో ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది.
పూరి గారు ఓ అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేశారంటే.. కచ్చితంగా ఏదో టాలెంట్ ఉందని అంతా అనుకుంటారు. అందుకే నాకు ఈ సినిమా విడుదల కాకముందే అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాను చేస్తున్నాను. ఇంకా నాకు బయోపిక్స్‌లో నటించాలని ఉంది. సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. లవ్ స్టోరీ సినిమాను చూశాను. ఆమె చాలా చక్కగా నటించింది. ఆమె డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఛార్మీ గారు మా వెంటే ఉన్నారు. ఆమె నాకు శిక్షణ ఇచ్చారు. మౌనికను నాలో ఆమె చూశారు. నన్ను నమ్మారు. ఆమె ఎంతో మంచి వ్యక్తి. ఇక రొమాంటిక్ సినిమాను కరోనా కంటే ముందే షూట్ చేశాం. లక్ష్య సినిమాను కరోనా సమయంలోనే షూట్ చేశాం. నా రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఆనందంగా ఉంది. రొమాంటిక్ సినిమ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మీరంతా కూడా రొమాంటిక్ చిత్రాన్ని ఎంతో ఇష్టపడతారు.