ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. మునుపెన్నడూ చూడని మాస్ గెటప్ లో అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం ను రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట చిత్రాన్ని డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన డబ్బింగ్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదిక గా వెల్లడించడం జరిగింది. వెండితెర పై పుష్పరాజ్ తన లాంగ్వేజ్ తో, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటాడు అని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను సైతం పోస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఈ చిత్రం కి డబ్బింగ్ చేస్తున్నట్లు ఇందులో ఉంది.
ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
The Dubbing formalities of #PushpaTheRise in full swing ????#PushpaRaj will thrill you on screens with his language and body language ????#ThaggedheLe ????#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic pic.twitter.com/U09WhFXFMz
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2021