నవదీప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. పైగా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లలో నవదీప్ కూడా ఒకడు. ప్రస్తుతం ఈ నటుడికి 35 సంవత్సరాలు. మరి పెళ్లి వయసు దాటేసింది కాబట్టి.. పెళ్లికి మాత్రం ఇంకా టైమ్ ఉందని చెబుతూ వస్తున్నాడు నవదీప్. అయితే, నెటిజన్స్ మాత్రం నవదీప్ పై రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ‘గడ్డం నెరిసిపోతుంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకో’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
అయితే, తనకు సలహా ఇచ్చిన ఓ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చాడు నవదీప్. ఇంతకీ నవదీప్ ఎలా రియాక్ట్ అయ్యాడు అంటే.. ‘అన్నా మీ గడ్డం తెల్లబడుతోంది, త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయినా గడ్డం తెల్లబడితే ముందు ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ, తోలు పీకేసుకోం కదా’ అంటూ నవదీప్ తనదైన శైలిలో తనకు ఉచిత సలహా పడేసిన నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022