వారి తర్వాత పవన్ స్పెషల్ పిక్స్ వైరల్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా తో పాటుగా పవన్ తన రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాడు. ఇక ఈ రెండు కూడా తాను బాలన్స్ గా నడుపుతుండగా నిన్న పవన్ అయితే వైజాగ్ లో మళ్ళీ ల్యాండ్ అవ్వడం ఆసక్తిగా మారింది.

అక్కడ చాలా కాలం తర్వాత వైజాగ్ బీచ్ నడిబొడ్డున పవన్ అలా సందర్శించడం మంచి ఆసక్తిగా మారింది. పైగా అక్కడ తన వైట్ అండ్ వైట్ లో గడ్డం లుక్ తో పవన్ కనిపించడం ఆ ఫోటోలు కొన్ని బయటకు రావడం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల లేటెస్ట్ లుక్స్ బయటకొచ్చి వైరల్ కాగా దీనితో పవన్ లేటెస్ట్ ఫోటోలు కూడా మంచి వైరల్ గా మారాయి.

Exit mobile version