పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు పవన్, ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.
అయితే గత కొన్నాళ్లుగా అటు హరిహర వీరమల్లు షూట్ తో పాటు ఇటు తన జనసేన పార్టీ కార్యక్రలాపాల్లో బిజీగా ఉన్న పవన్, అతి త్వరలో భవదీయుడు భగత్ సింగ్ మూవీని మొదలెట్టేందుకు యూనిట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం అతి త్వరలో ఈ మూవీకి సంబంధించి అధికారిక పూజా కార్యక్రమాలతో పాటు మూవీ షూట్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. మరి ఒకరకంగా ఇది ఎప్పటి నుండో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల కాంబో మూవీ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా దీనిపై త్వరలో అఫీషియల్ గా న్యూస్ బయటకు రానుందని తెలుస్తోంది.