పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ భామ శ్రీలీల ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. పవర్ స్టార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీ కి సంబంధించి ప్రస్తుతం ఒక భారీ సెట్టింగ్ ని సిద్ధం చేస్తోంది యూనిట్.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో సిద్ధం అవుతున్న ఈ సెట్టింగ్ తాలూకు వీడియోని కొద్దిసేపటి క్రితం మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మరొకసారి పవన్, హరీష్ ల క్రేజీ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ తప్పకుండా అందరి అంచనాలకు మించి ఉంటుందని అంటోంది యూనిట్. కాగా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు.
Massive set is being erected for a key schedule of #UstaadBhagatSingh under the supervision of art director #AnandSai ????????@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose @ChotaKPrasad @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/iDt8LWmqew
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 5, 2023