మంచు విష్ణు.. ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ ?

Published on May 1, 2019 6:44 pm IST

మంచు విష్ణు తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. విష్ణు తన ట్వీట్ లో ‘రేపు ఎనౌన్స్ మెంట్ తో నా లైఫ్ చేంజ్ అవ్వబోతుందని’ పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ కి అర్ధం ఏంటా అని నెటిజన్లు వరుసగా కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్య కొన్ని సామాజిక అంశాల పైన కూడా బాగా యాక్టివ్ గా స్పందించిన మంచు విష్ణు.. ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైసిపి తరుపున ప్రచారం చేశారు.

కాగా బహుశా మంచు విష్ణు ఇక సినిమాలు చేయనని ప్రకటిస్తారేమోనని అంతా అనుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు గుడ్ బై చెబుదామనే ఆలోచనతోనే మంచు విష్ణు ఈ ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే విష్ణు మాత్రం ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారో రేపు తేలనుంది.

సంబంధిత సమాచారం :

More