ఇంటర్వ్యూ : ప్రభాస్ – నా పాత్ర తీరులోనే పక్కా మాస్‌ ఉంటుంది !

ఇంటర్వ్యూ : ప్రభాస్ – నా పాత్ర తీరులోనే పక్కా మాస్‌ ఉంటుంది !

Published on Mar 7, 2022 7:02 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌, ప్రభాస్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. సినిమా విశేషాలు పంచుకున్న అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధాలిచ్చారు.
ఆ విశేషాలు మీ కోసం.

‘రాధేశ్యామ్‌’.. “గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలో చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది ?

ప్రభాస్ : “గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలో సినిమా చేయాలంటే నాకు ఎప్పుడూ టెన్షనే. ఎందుకంటే మా పెద్దనాన్న కృష్ణంరాజు గారి బ్యానర్ ఇది. ఈ బ్యానర్‌లో ఆయనతో కలిసి ‘బిల్లా’లో నటించా. హిట్‌ అయింది. ‘రాధేశ్యామ్‌’ కూడా సూపర్ హిట్ అవుతుంది అని ఆశిస్తున్నాను.
,

ఈ సినిమాలో మీతో పాటు కృష్ణంరాజు గారు కూడా నటించారు. దాని గురించి ?

ప్రభాస్ : కొవిడ్‌ వచ్చినా పెద్దనాన్న మాకు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఇక ఈ సినిమాలో ఆయన పరమహంస అనే కీలక పాత్రలో నటించారు. ఇక నేను ఆయనతో కలిసి రెండు సన్నివేశాల్లో కనిపిస్తాను.

ఈ కథ విన్నప్పుడు మీకు ఏమి అనిపించింది ?

ప్రభాస్ : వ్యక్తిగతంగా నేను ఆస్టాలజీని నమ్మను. అందుకే దర్శకుడు కథ చెప్పన్నప్పుడు సగం విన్నాక నేను నో చెప్పేద్దామని మొదట భావించాను. అయితే కథ వినడం మొదలు పెట్టిన తర్వాత కథ పై నాకు ఆసక్తి పెరిగింది. అందుకే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

మీరు చాలాకాలం తర్వాత ప్రేమకథలో నటించారు కదా ?

ప్రభాస్‌: నేను వరుసగా ‘బాహుబలి’, ‘మిర్చి, ‘సాహో’ లాంటి యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం నాకు కాస్త రిలాక్స్‌గా అనిపించింది.

ఈ సినిమానికి అస్సలు ఎంత బడ్జెట్‌ పెట్టారు?

రవిందర్‌: ఇప్పటికే అన్ని కోట్లు ఇన్ని కోట్టు రాసేశారు (నవ్వుతూ… ). అయితే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా బడ్జెట్ .

రాధాకృష్ణ : ఈ సినిమాకు సుమారు రూ.800 కోట్లు ఖర్చయింది. ప్రేక్షకులు తెరపై చూసేటపుడు రూ.1000 కోట్ల అనుభూతి పొందుతారు.

ఈ చిత్రం ప్రచార విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు ?

ప్రభాస్‌: నిజం చెప్పాలంటే.. ఈ సినిమా ప్రచారం బాగా కష్టమైంది. దీనికితోడు ఈ సినిమా కోసం పలుమార్లు ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది.

మీరు ఈ చిత్రాన్ని అంగీకరించడానికి ముఖ్య కారణం?

ప్రభాస్‌: దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానమే. నా పాత్ర నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒక హస్తసాముద్రికా నిపుణుడిగా నటించడం నాకు థ్రిల్‌ అనిపించింది.

ఈ సినిమాలో యాక్షన్‌ అంశాలు ఆశించొచ్చా?

ప్రభాస్‌: 18 నిమిషాల షిప్‌ ఎపిసోడ్‌లో యాక్షన్‌ కావాల్సినంత ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఛేజింగ్‌ సీన్లు ఉన్నాయి. అలాగే నా పాత్ర ‘విక్రమాదిత్య’ మాట్లాడే తీరులోనూ పక్కా మాస్‌ ఉంటుంది.

మీరు ఓ పూర్తిస్థాయి కామెడీ సినిమాలో నటించబోతున్నారు అని తెలిసింది. నిజమేనా?

ప్రభాస్‌: అవును చేస్తున్నాను. కాకపోతే, ఆ వివరాలను ఇప్పుడే చెప్పలేను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు