ఇంటర్వ్యూ: ఇందులో ఒక మెసేజ్ ఉందని నా ఫీలింగ్ – అఖిల్ అక్కినేని

ఇంటర్వ్యూ: ఇందులో ఒక మెసేజ్ ఉందని నా ఫీలింగ్ – అఖిల్ అక్కినేని

Published on Oct 14, 2021 5:28 PM IST


అఖిల్ అక్కినేని హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. ఈ మేరకు ఈ చిత్రం కి సంబంధించిన పలు విషయాలను అఖిల్ మీడియా మిత్రులతో పంచుకున్నారు.

మీరు నిజంగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

అందరూ ఇదే అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.

ఈ సినిమాలో పెళ్లి, ప్రేమ అనే కాన్సెప్ట్ పై మీ ఫీలింగ్ ఎంటి?

భాస్కర్ కథ చెప్పినప్పుడు లవ్ స్టోరీ లా కాకుండా, డైలీ లైఫ్ లో మ్యారేజ్ లైఫ్, లేక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఒక ప్రశ్న అడిగి, దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నించాం. నాకు అది నచ్చింది. ఇందులో ఒక మెసేజ్ ఉందని నా ఫీలింగ్.

పెళ్లి కాలేదు కదా, ఎలా గెస్ చేసారు సినిమా గురించి?

పెళ్లి కాకపోయినా, రిలేషన్ షిప్ లో ఉన్నా, నాకు ఒక గల్ ఫ్రెండ్ ఉంది. బొమ్మరిల్లు చిత్రం లో తండ్రి కొడుకు, తండ్రి కూతురు మధ్య ఉండే రిలేషన్ ను అందరూ రిలేట్ చేయగలుగుతారు. ఇది కూడా చాలా రిలేటబుల్ సబ్జెక్ట్. ఈ సినిమాలో అమ్మాయి మరియు అబ్బాయి కి మధ్య కొన్ని ఇష్యూస్ తీసుకురావడం జరిగింది, అవి ఎలా సాల్వ్ చేశారు అనేది సినిమాలో తెలుస్తోంది. అదే విధంగా రేపు సినిమా చూశాక మీరు కూడా ఇదే చిన్న చిన్న సమస్యలకు ఒక సొల్యూషన్ దొరికింది అని అనుకుంటే మేము సక్సెస్ అయినట్టే.

నాన్నగారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను, ఎక్కువ ఇన్ పుట్స్ లేకుండా కొంచెం ఎడిట్ రూంలో చేంజెస్ చేయడం జరిగింది. మేజర్ గా ఏం చేంజెస్ చేయలేదు.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

మీరు పోస్టర్స్ లో చూసి ఉంటారు. మొదటి పార్ట్ కి రెండవ పార్ట్ కి ఒక జర్నీ ఉంది. హర్ష అనే పాత్ర ద్వారా ఈ సినిమాలో ఎలా మెచ్యూర్ గా ఉంటారు అనేది చూపిస్తాం. ఒక కన్ఫ్యూస్డ్, ఇన్నోసెంట్ అబ్బాయి నుండి ఒక కాన్ఫిడెంట్ మ్యాన్ గా డెస్టినేషన్ కి చేరుతాడు అని చూపించడానికి ట్రై చేశాం.

బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా గ్యాప్ వచ్చింది. ఎలా రియాక్ట్ అయ్యారు?

నేను ఎవరిని కలుస్తున్నా అని తెలియకుండా ఆఫీస్ కి వెళ్ళాను, అక్కడ కథ విన్నాక నమ్మి చేశాను. అలా అని ఆయనకి గ్యాప్ రావడం వల్ల ఆయన తగ్గారు అని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే కథను గట్టిగా నమ్మాను.

బొమ్మరిల్లు లో లాగా ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ కీ రోల్ ప్లే చేస్తుందా?

ఫ్యామిలి ఎంటర్ టైనర్ అయినా, లవ్ స్టోరీ అయినా అన్ని క్లైమాక్స్ లోనే రౌండప్ అయ్యి వస్తాయి.

ఈ సినిమాలో చాలా ఎక్కువ మంది గల్స్ ను చూపించారు?

కథకి అనుగుణంగా చాలా పాత్రలు ఉన్నాయి. పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ ఉంది. సినిమాలో 4 నుండి 5 పెళ్లి చూపులు సీన్స్ వాడాం. ఆ సీన్స్ లో హీరోయిన్స్ కూడా ఉన్నారు.

ఈ సినిమాలో రొమాన్స్ కి ఇంపార్టెన్స్ ఉందా?

ఉంది. ముద్దు పెట్టడం, అలా కాదు. రొమాన్స్ అనేది ఫిజికల్ టచ్ ఒకటే కాదు. చాలా రకాలుగా రొమాన్స్ ను చూపించ వచ్చు.

పూజ హెగ్డే తో చేయడం ఎలా ఉంది?

కష్టపడి చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. రెస్పెక్ట్ ఇస్తాను. సక్సెస్ ఊరికే రాదు, ఎంత కష్టపడితే అంత తిరిగి వస్తుంది. తను కెరీర్ లో ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది.

బాలీవుడ్ నుండి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా?

నేను తెలుగు వాడ్ని, ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకోవడం పై కూడా సంతోషం గా ఉన్నాం. సీఎం జగన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం కి థాంక్స్. మనకు చాలా అవసరం. అందరూ కూడా సేఫ్ గా కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అయి సినిమా చూడాలి.

సినిమా ఓకే చేయడానికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. అదే విధంగా ఎన్ని రోజులు పట్టింది ఈ కథ కి ఓకే చెప్పడానికి?

ఈ సినిమా కోసం నిర్ణయం తీసుకోవడానికి 10 రోజులు పట్టింది. కానీ, సింగిల్ సిట్టింగ్ లోనే నాకు బాగా నచ్చేసింది. కొత్తగా ఉంది, ఫ్రెష్ గా ఉంది. అప్పటికే అరవింద్ చాలా ఫిల్టర్ చేసేశారు. ఆ పది రోజులు కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేయకూడదు అనే ఉద్దేశ్యం తో టైమ్ తీసుకున్నా. లవ్ స్టోరీ కంటే కూడా పెద్దది. లవ్ స్టోరీ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది.

ఏజెంట్ ఈ సంవత్సరం రాదు. షూటింగ్ చాలా స్పీడ్ గానే జరుగుతుంది. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల కి రెడీ గా ఉన్నాయి. సంక్రాంతి, సమ్మర్ కి కూడా విడుదల అవుతుందో లేదో తెలీదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు