ఇంటర్వ్యూ : దర్శకుడు కిషోర్ తిరుమల – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ రాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో సాలిడ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ ఎలా ఉండబోతుంది?

ఒక భర్త తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, కష్టాల ద్వారా నేర్చుకున్న పాఠాలను ఇతర భర్తలకు చెప్పడం ఈ కథ యొక్క ప్రధాన సారాంశం.

ఈ సినిమా ప్రమోషన్స్ లో డాన్స్ చేశారు కదా.. అంత జోష్ ఎలా వచ్చింది?

ఈ రోజుల్లో సినిమా తీయడం ఒక పెద్ద సవాలైతే, దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లే ప్రమోషన్స్ కూడా అంతే కీలకం. ప్రత్యేకంగా ప్రమోషన్ కోసం చేశాననేది కాదు కానీ, ఆ సమయంలో వచ్చిన ఉత్సాహంతోనే నేను డాన్స్ చేశాను. ఈ సినిమాలో సత్య నటించిన ఒక పాటకి కొరియోగ్రఫీ కూడా చేశాను. అదొక చిన్న బిట్ సాంగ్. ఆ పాట ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈ కథకి ముందు రవితేజ గారిని అనుకున్నారా?

అవునండి. రవితేజ గారితో చేద్దామని అనుకున్న తర్వాతే కథని డెవలప్ చేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్టు చక్కగా వచ్చిన విధానం చూసి ముందు ఈ సినిమానే చేద్దామని అన్నారు.

హీరోయిన్స్ గురించి?

ఆషికా, డింపుల్.. ఇద్దరి క్యారెక్టర్ లో డిఫరెంట్ గా ఉంటాయి. ఇద్దరికీ మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఆషికా పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. డింపుల్ కూడా ఇప్పటివరకు కనిపించని ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి గారి గురించి?

సుధాకర్ గారు ఒక నిర్మాత కంటే నాకు ఒక బ్రదర్ ఫ్రెండ్ లాంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తారు. చాలా సపోర్ట్ చేస్తారు. సినిమా బాగుండాలి బాగా రావాలని తపనపడే నిర్మాత.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?

రెండు మూడు కథలు ఉన్నాయి. డివోషనల్ మైథాలజీలో ఒక స్క్రిప్టు. అలాగే మున్నా భాయ్ లాంటి సోషల్ సెటైర్ కథ ఉంది. అయితే ఏది ముందుగా చేయాలనేది త్వరలోనే తెలియజేస్తాను.

Exit mobile version