ప్రత్యేక ఇంటర్వ్యూ : మసాలా ను అంగీకరించడానికి నాకు సమయం పట్టింది – రామ్

ప్రత్యేక ఇంటర్వ్యూ : మసాలా ను అంగీకరించడానికి నాకు సమయం పట్టింది – రామ్

Published on Nov 13, 2013 11:50 PM IST

Ram
హీరో రామ్ ‘మసాలా’ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాలో అతనితో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు. కె విజయ్ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా గురించి విశేషాలు తెలుసుకోవడానికి మేము రామ్ తో చిన్న ఇంటర్వ్యూలో పాల్గున్నాం. రామ్ ఈ సినిమాలో తన పాత్రపై చాలా అనుమానం కలిగినా ఆఖరికి పాత్రకు న్యాయం చేశానన్నాడు. ‘మసాలా’ లో తన పాత్ర గురించి తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పిన వివరాలు తెలుసుకుందాం

ప్రశ్న) ఈ సినిమాలో మీరు చాలా ఉత్తేజంగా వున్నట్టున్నారు…

స) అవును. ఈ సినిమాలో నాకు రెండు విభిన్న పాత్రలు వున్నాయి. మీరు గనుక ‘బోల్ బచ్చన్’ చూసివుంటే నా ఈ విభిన్న లుక్ కి సమాధానం వచ్చివుంటుంది(నవ్వుతూ)

ప్రశ్న) అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైంది?

స) వెంకటేష్ గారు ‘బోల్ బచ్చన్’ సినిమాను చూసి పెద్దనాన్న గారితో(స్రవంతి రవికిషోర్) ఈ ఆలోచన పంచుకున్నారు. నేను కుడా ఆ సినిమా చూసి రెండో పాత్ర విషయంపై సంశయించాను. నేను ఒప్పుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆఖరికి “ఎవరన్నా డేర్ చేస్తే బెటర్ కదా” అని ఒప్పుకున్నాను. నేను ఇలాంటి పాత్ర పోషిస్తానని అనుకోలేదు

ప్రశ్న) తెలుగు ప్రేక్షకులకోసం ఈ సినిమాలో ఏమైనా మార్పులు చేసారా??

స) అవును. ఈ సినిమాలో నా పాత్ర ఛాలెంజింగ్ గా వుంటుంది. మన వాళ్లకు నచ్చేలా శ్రుతి మీరకుండా నటించాను. ఎక్కడా ఓవర్ కాకుండా నటించడం కత్తి మీద సామే

ప్రశ్న) మీరు మొదటిసారిగా వెంకటేష్ వంటి పెద్ద హీరోతో నటించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎమన్నా భయపడ్డారా?

స) లేదు నేను భయపడలేదు. చాలా ఉత్సాహంగా నటించాను. ఉదాహరణకు ఎవరన్నా బంగీ జంప్ చెయ్యాలనుకోండి వారికి భయం కన్నా ఉత్సాహమే ఎక్కువ వుంటుంది.నాకు వెంకటేష్ గారితో మంచి అనుభవం దొరికింది. మేము నటించిన ప్రతీ కామెడి సన్నివేశాన్ని నేను ఆనందించాను.

ప్రశ్న) దర్శకుడి ఎంపిక ఎలా జరిగింది?

స) సినిమా చేద్దాం అనుకుని నెల అయిన తరువాత కూడా దర్శకుని ఎంపిక జరగలేదు. నేను ఈ కధను భాస్కర్ అంకుల్ అయితే రక్తి కట్టించగలరాణి భావించాను. అందరూ అలానే అనుకున్నారు. ఆయన చాలా ప్రతిభావంతుడు. ఏ విషయానికి అంత తేలికగా కోప్పడరు

ప్రశ్న) మీ తదుపరి ప్రాజెక్ట్ల వివరాలు?

స) నిజంగా మాట్లాడితే నేనింకా ఏమి అనుకోలేదు. నేను స్క్రిప్ట్ లను కొని పక్కన ఉంచుతున్నాను. నేను పెద్ద బ్యానర్ల మరియు దర్శకుల దగ్గర కధలు కూడా వింటున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ లో స్క్రిప్ట్ లకన్నా కాంబినేషన్ల కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నాకు ఆ ట్రెండ్ ఇష్టం లేదు. నేను ఆ దిశగా వెళ్ళే ముందు నేను చెయ్యవలసిన పనులు కొన్ని చేస్కుంటాను

ప్రశ్న) స్క్రిప్ట్ విషయంలో మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

స) నాకు నిజంగా తెలీదు. నాకు స్క్రిప్ట్ నచ్చితే ఏడాది దాటాక కూడా చిన్న చిన్న విషయాలు చెప్పగలను. నాకు నచ్చకపోతే చిన్న విషయం కూడా చెప్పలేను. ఎవరైనా స్క్రిప్ట్ చెప్తుంటే 4 – 5 విధాల ద్వారా ఆలోచిస్తాను. కధ చెప్పే వాడు 6వ విధంగా చెప్తే నాకు నచ్చుతుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అంతే ఇష్టం

ప్రశ్న) చిన్న చిన్న బడ్జెట్ లలో తమిళ మరియు మలయాళం నటులు ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. మీకు ఆ ఆలోచన ఏమన్నా ఉందా?

స) “అందరి దర్శకులకి నన్ను చూస్తే ప్రయోగాలు చెయ్యాలనిపిస్తుంది” (నవ్వుతూ). ఉదాహరణకు నేను కరుణాకరన్ తో ప్రేమకధను చేయాలనుకున్నా. కానీ ఆటను నాతొ వేరే విధమైన సినిమా తీసాడు. ఇదివరకే ఇలాంటివి మరొకటి జరిగింది. నేను దర్శకులను ఉత్తేజపరచడం నాకు నచ్చింది.

చిన్న బడ్జెట్ సినిమాల విషయానికొస్తే మనకి భారీ నిర్మాణ విలువలతో, భారీ సెట్లనడుమ చూడడం ఇష్టం. తమిళ మరియు మలయాళం వారికి వేరే సంస్కృతి. ఎవరి ఇష్టాలు వాళ్ళకి వుండడం సహజం

ప్రశ్న) ఫ్లాపులు మిమ్మల్ని భాధపెడతాయా?

స) జగడం తరువాత నేను చాలా భాధలో వున్నాను. “ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పుకోకపోతే ఎంత బాధ వస్తుందో అంతా బాధగా”. నా కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదురుకున్నా. నేను స్టాక్ మార్కెట్ లాంటి వాడిని. ప్రస్తుతం నా తప్పులను తెలుసుకుని నేను ఆనందంగా వున్నాను

ప్రశ్న) ఏమైనా భాధలున్నాయా?

స) నేను బాధలని చెప్పలేను. కాకపోతే తప్పక హిట్ అవుతుందన్న సినిమా ఫ్లాప్ అయితే బాధ వేస్తుంది సినిమా ఒప్పుకునే ముందు స్క్రిప్ట్ నూ దర్శకుడినో నమ్ముతాను లేదా నమ్మిస్తారు. ఒక్కోసారి దర్శకుడు చెప్పిన విషయం నాకు నచ్చకపోయినా అతని మీద నమ్మకంతో ఒప్పుకుంటాను. కానీ ఒకోసారి అవి ఫలించవు. కానీ బాధలేమీ లేవు(నవ్వుతూ)

ప్రశ్న) మీ జీవితంలో మార్గదర్శకుడు ఎవరు?

స) నాకు ఇండస్ట్రిలో పెదనాన్నగారు ఇష్టం. ఆయన మా ఇంటికి చాలా దగ్గర బంధువు. ఉదాహరణకు ఆయన ఇంట్లో ఎవరైనా చనిపోయినా వెంటనే వెళ్ళి అవసరమైతే కామెడీ సీన్ నటించగల దృక్పధం ఆయనది

ప్రశ్న) సినిమాలో మరే ఇతర క్రాఫ్ట్స్ పైనాన్నా ఇష్టం వుందా?

స) నాకు సినిమాలో అన్నీ క్రాఫ్ట్స్ చాలా ఇష్టం. కానీ నేను అన్నీ పనులు చేయలేను. “మ్యూజిక్ టాలెంట్ ఉంది కదా అని మ్యూజిక్ డైరెక్టర్ అయిపోకూడదు”. మంచి సినిమాకోసం మంచి సంగీత దర్శకుడినే ఎంచుకోవాలి. మిగిలిన విషయాలలో కూడా అంతే. నిర్మాణంలో మా కుటుంబం వున్నందువల్ల నేనేమీ చేయలేని పరిస్థితి

ప్రశ్న) ఖాళీ సమయాల్లో మీరు ఏం చేస్తారు?

స) మా కుటుంబంతో గడుపుతాను. కొత్త కొత్తగా ఆలోచిస్తాను. వాటిలో డాన్స్ లు కూడా వుంటాయి. వాటి వలనే సేద తీరుతాను

ప్రశ్న) పెళ్లిపై ఆలోచనలు వున్నాయా?

స) (నవ్వుతూ) నిజంగా చెప్పాలంటే మన పెళ్లి మనం నిర్ణయించలేమ్. అయ్యాక ‘అరెరే అయిపోయిందే అనుకోవడమే’. మా స్నేహితులు అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. ఆరునెలలో ఒక స్నేహితుడి మినహా అందరూ చేసేస్కున్నారు. అతనికి కూడా త్వరలో పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో(నవ్వుతూ)

ప్రశ్న) మసాలా పై చివరిగా ఒక మాట చెప్పమంటే?

స) సినిమా మొదట్నుంచి చివరివరకూ ఆద్యంతం వినోదంగా సాగుతుంది. ఇంటెర్వెల్ మినహా అంతా నవ్వుకుంటూ చూస్తారు. ఈ సినిమా 14న విడుదలకానుంది. అందరూ తప్పకుండా చూడండి

దీనితో రామ్ తో జరిపిన సంభాషణ ముగిసింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – వంశీ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు