ఇంటర్వ్యూ : ‘ది ఘోస్ట్’ లో నా డ్రీమ్ లో చేశా.. సినిమా కంప్లీట్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ – హీరోయిన్ సోనాల్ చౌహాన్

Published on Sep 24, 2022 11:16 pm IST

 

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా గరుడవేగా మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ ది ఘోస్ట్. ఈ మూవీలో నాగార్జున కి జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ సంస్థలు కలిసి ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 5 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గురించి నేడు హీరోయిన్ సోనాల్ చౌహన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

తెలుగులో కొంత గ్యాప్ తీసుకున్నటున్నారు ?

అదేమి లేదండి ఇటీవల అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్ 3 లో ఒక చిన్న రోల్ చేశా కదా, నాకు హిందీలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. కానీ తెలుగు నా ఫస్ట్ లవ్.

 

ది ఘోస్ట్ ప్రాజక్ట్ లోకి ఎలా వచ్చారు ?

ఇటువంటి థ్రిల్లింగ్ మూవీస్ చేయాలనేది నాకోరిక. ఇక డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మంచి క్రియేటివ్ డైరెక్టర్. అలానే ఈ మూవీలో హీరోగా నాగార్జున నటిస్తుండడంతో నా ఆనందం నిజంగా వర్ణనాతీతం. మూవీ కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. ఈ మూవీలో నేను ఇంటర్ పోల్ అధికారి పాత్రలో కనిపిస్తాను.

 

ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఏ విధమైన ట్రైనింగ్ తీసుకున్నారు ?

ఈ విధమైన సవాలుతో కూడుకున్న రోల్ చేయడం నా కెరీర్ లో ఫస్ట్ టైం. ముఖ్యంగా ఈ పాత్ర కోసం చాలానే ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సాధారణ శిక్షణ తో పాటు ఎం ఎం ఏ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అయితే ట్రైనింగ్ మొదట్లోనే నా కాలుకి గాయం అయింది. గాయం చిన్నదే అనుకున్నాను, కానీ డాక్టర్ దగ్గరకు వెళితే ఎక్స్ రే తీసిన అనంతరం కొన్నాళ్లపాటు రెస్ట్ అవసరం అని చెప్పారు. అయితే కొద్దిరోజుల తరువాత మళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆయుధాల విషయంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను.

 

గన్ పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైమా ?

మా నాన్న స్వతహాగా పోలీస్ అధికారి కావడంతో గన్స్ తో నాకు కొంత టచ్ ఉంది. అయితే మూవీ కోసం ఏకే 47 వంటి గన్స్ ని పక్కాగా హ్యాండిల్ చేయడం, కాల్చడం, లోడ్ చేయడం, వాటిని ప్రత్యేకంగా హ్యాండిల్ చేయడం విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాను. వీటితో పాటు డైలాగ్స్ పలికే విషయంలో కూడా శ్రద్ధ కనబరిచాను. నిజానికి ఈ మూవీలోని పాత్ర నాకు డ్రీమ్ రోల్ కావడంతో ఆ రోల్ కోసం ఖచ్చితంగా మరింతగా కష్టపడాలని నిర్ణయించాను. అలానే ఎంతో టాలెంటెడ్ టీమ్ తో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందకరం. సినిమా చూస్తోసిన తరువాత నా పాత్ర కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.

 

నాగార్జున గారితో కలిసి యాక్ట్ చేసిన ఫీలింగ్ గురించి చెప్పండి ?

నాగార్జున గారితో వర్క్ చేయాలి అనేది నిజానికి నా డ్రీం. ఆయన కు నేను పెద్ద అభిమానిని. ఆయనని మొదట కలిసినపుడు కొంత నెర్వస్ గా ఫీల్ అయ్యాను. అయితే ఆ తరువాత అంతా మామూలే. నాగ్ నిజంగా ఎంతో గ్రేట్ పర్సన్. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఒక మధురానుభూతి. ఇక వేగం సాంగ్ లో ఆయనతో కలిసి వర్క్ చేసింది మీరు చూఓసి ఉంటారు. తప్పకుండ భవిష్యత్తులో నాగ్ తో కలిసి మంచి రొమాంటిక్ మూవీ చేయాలని ఉంది.

 

ప్రభాస్, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ తో వరుసగా వర్క్ చేసే ఛాన్స్ మీకు వచ్చిందంటే, మీ టైం టాలీవుడ్ లో స్టార్ట్ అయిందనుకోవచ్చా ?

నిజానికి అటువంటి బిగ్ స్టార్స్ మూవీస్ లో వరుసగా నాకు అవకాశాలు రావడం నిజంగా ఎంతో ఆనందం. అలానే నేను చేయబోయే పాత్ర మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాను, అలానే ఇకపై మరిన్ని మంచి పాత్రల్లో ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాను.

 

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి ?

ప్రవీణ్ గారు మంచి విజన్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయన తో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంటుంది. నీట్ గా తన హోమ్ వర్క్ తాను పక్కాగా చేసుకుంటారు, దాని వలన సెట్స్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడంతో పాటు నటీనటులకు పని మరింత ఈజీ అవుతుంది.

 

మొత్తంగా ఈ మూవీలో ఎన్ని యాక్షన్ బ్లాక్స్ లో మీరు కనిపిస్తారు ?

ఇది కంప్లీట్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. నాకు ఇందులో రెండు పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి.

 

జయాపజయాలపై మీ అభిప్రాయం ?

మాది సంప్రదాయమైన రాజ్ పుత్ ఫామిలీ. నటన గురించి ప్రక్కన పెడితే, నిజానికి మా ఇంటి నుండి బయటకు రావడమే గొప్ప. కెరీర్ బిగినింగ్ లో ఇంటి నుండి బయటకు వచ్చి సినిమాలు చేయడం తప్ప పెద్దగా ఏమి తెలిసేది కాదు. అనంతరం మెల్లగా అన్ని సినిమా ఇండస్ట్రీ ద్వారానే తెలుస్తూ వచ్చాయి. లైఫ్ లో ఎత్తుపల్లాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా మానేజ్ చేయాలి అనేది బాగా తెలిసింది.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?

రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను.

సంబంధిత సమాచారం :