ఇంటర్వ్యూ : అనిల్‌ రావిపూడి – ప్రస్తుతం నా లక్ష్యం అదే !

Published on Nov 23, 2021 3:00 am IST


టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి రేపు తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో ఎక్స్ క్లూజివ్ గా ఒక ఇంటర్వ్యూ మీ కోసం.

 

తెలుగులో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకుల్లో మీరు ఒకరిగా నిలవడం ఎలా అనిపిస్తుంది?

ఇండస్ట్రీలో దర్శకుడిగా నాకు ఇది ఆరో పుట్టినరోజు. ఈ స్థాయికి వచ్చినందుకు మంచి పేరు సాధించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే, నా నుంచి ఇంకా నా బెస్ట్ రాలేదని భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయి.

రానున్న సంక్రాంతికి మీరు ‘ఎఫ్ 3’ రిలీజ్ ను మిస్ అవుతున్నారా?

అవును, కాకపోతే ఎఫ్‌3 సోలోగా విడుదల చేయాలని దిల్‌రాజు గారూ, నేనూ భావించాం. అందుకే సంక్రాంతి నుంచి తప్పుకున్నాం. ఈ చిత్రం పూర్తి కావస్తోంది. ఇక ఎఫ్ 2 కంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది. క్యారెక్టర్స్ సేమ్ ఉంటాయి , కానీ సెటప్ భిన్నంగా ఉంటుంది.

 

భవిష్యత్తులోనూ ఈ ఫ్రాంచైజీ కొనసాగుతుందా?

అవును, ఈ ఫ్రాంచైజీ రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. వెంకటేష్ గారు, వరుణ్ ఈ ఫ్రాంచైజీకి హైలైట్స్. ఈ ఫ్రాంచైజీలో వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతారు.

 

ఎఫ్ 3 లో ఒకేసారి ఎక్కువ మంది స్టార్లను ఎలా హ్యాండిల్ చేశారు?

నిజమే, ఒకే సమయంలో చాలా మంది స్టార్‌లను మేనేజ్ చేయడం చాలా కష్టం. అయితే, షూట్ లో అయినా, షెడ్యూల్స్ లో అయినా అందరినీ బ్యాలెన్స్ చేశాము. షూటింగ్ బాగా జరిగింది.

 

ఎఫ్3లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాత్రల గురించి చెప్పండి?

ఈ చిత్రంలో వెంకటేష్‌ గారి పాత్రకు రేచీకటి. ఇక వరుణ్ పాత్రకు నత్తి. ఈ సమస్యలతో F3 కథ ఎలా సాగుతుంది ? కథ పాత్రలను ఎలా నడిపిస్తాయి ? అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది.

 

మీరు పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తారు?

ఎఫ్ 3 కి పాన్-ఇండియా అప్పీల్ ఉంటుంది. కానీ నాకు తెలుగులో సినిమాలు చేయడమే ఇష్టం. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, తెలుగులో టాప్ స్టార్స్‌తో పెద్ద సినిమాలు చేస్తాను. ప్రస్తుతం నా లక్ష్యం అదే.

 

మీరు వినోదాత్మక చిత్రాలకు మాత్రమే కట్టుబడి ఉంటారా?

అదేం లేదు. అలా నేను చేయను కూడా. నిజానికి, ‘సరిలేరు నీకెవ్వరు’ ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే సీరియస్ సినిమా. కాకపోతే ఆ డ్రామాలో కామెడీని జోడించాము. రానున్న రోజుల్లో కూడా అప్పటి ట్రెండ్స్ చూసి వాటికీ తగ్గట్టుగా కథలను డెవలప్ చేస్తాను.

సంబంధిత సమాచారం :