ఇంటర్వ్యూ : రోహన్ – “7 డేస్ 6 నైట్స్” ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి

ఇంటర్వ్యూ : రోహన్ – “7 డేస్ 6 నైట్స్” ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి

Published on Jun 15, 2022 4:07 PM IST

 

ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి ఎం ఎస్ రారాజు తెరకెక్కించిన డర్టీ హరి హిట్ తో నెక్స్ట్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా హిట్ తో మళ్ళీ ఆ తరహా కొత్త కాన్సెప్ట్ తో తాను చేసిన తాజా సినిమానే “7 డేస్ 6 నైట్స్”. అయితే ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్ తో పాటు మరో హీరోగా నటించిన మరో నూతన హీరో రోహన్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఈ యంగ్ నటుడు ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

 

మీ బాక్గ్రౌండ్, సినిమాల్లోకి ఎలా రావాలి అనుకున్నారో చెప్పండి?

మాది గుంటూరు, కాకపోతే నాన్న గారు ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ ఉద్యోగి కావడం వల్ల చిన్నప్పుడు అంతా ఇండియా అంతా చుట్టేసాను. తర్వాత ఐదో తరగతి టైం లో హైదరాబాద్ కి వచ్చాను అక్కడ నుంచి ఇంటర్ వరకు ఇక్కడే. తర్వాత ఇంజనీరింగ్ కి ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పుడు నుంచి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కడో సెట్ అవుతానా లేదా అని ఉండేది. కానీ తర్వాత జర్మనీలో ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యి నేర్చుకొని ఇక్కడకి వచ్చాక ఎంతోమందిని కలవడం, ఆడిషన్స్ ఇవ్వడంతో సునీల్ గారి ద్వారా ఎం ఎస్ రాజు గారిని కలవడం ఈ సినిమాలో రోల్ ఉంది అంటే దానికి ఓకే అవ్వడం జరిగింది.

 

సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి?

సినిమాలో నేను మంగళం అనే రోల్ లో కనిపిస్తాను. ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉండే ఒక హైపర్ యాక్టీవ్ కుర్రాడిలా అమ్మాయిల విషయంలో మొహమాటం లేకుండా మాట్లాడే వాడిలా కనిపిస్తాను. ఇలాంటి కుర్రాడు తన ఫ్రెండ్ తో కలిసి ఒక బ్యాచ్ లర్ టూర్ కి వెళ్తే అక్కడ ఏమవుతుంది అనేది సినిమాలో చూస్తారు.

 

ఇదే టైటిల్ తో హాలీవుడ్ లో ఓ సినిమా ఉంది దానితో ఏమన్నా సంబంధం ఉందా?

సినిమా ఉంది నాకు తెలుసు, నేను కూడా చూసాను. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్కడా కూడా చిన్న లింక్ కూడా ఉండదు. అది చెప్పగలను. మీకు కూడా ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

 

సుమంత్ అశ్విన్ తో వర్క్ ఎలా అనిపించింది?

సుమంత్ అన్నతో వర్క్ చాలా బాగా అనిపించింది. ఎం ఎస్ రాజు గారి కొడుకు అని ఎక్కడా యాటిట్యూడ్ ఉండదు నేను ముందు కంగారు పడ్డాను కానీ సుమంత్ అన్న చాలా డౌన్ తో ఎర్త్ గా సుమంత్ అన్న ఉంటాడు.

 

ఈ సినిమాలో మీకు ఛాలెంజ్ గా అనిపించిన అంశాలు ఏంటి?

ఈ సినిమా వరకు కొన్ని ఉన్నాయి. మొదటగా నేను చేసిన రోల్ తెలంగాణ కుర్రాడాది నేను బయట ఆంధ్ర సినిమాలో ఆ తెలంగాణ యాస నేర్చుకొని మాట్లాడ్డం కొత్తగా అనిపించింది. ఇంకా నేను బయట చాలా రిజర్వ్డ్ గా ఉంటాను కానీ మంగళం మని రోల్ పూర్తి ఓపెన్ గా ఉంటుంది. ఈ అంశాలు నాకు కొత్తగా అనిపించాయి.

 

ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మెసేజ్ ఏమన్నా ఇచ్చారా?

అవును ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫన్ గా ఉన్నాయి మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మెసేజ్ అంటే ఇది అయ్యిపోమని ఉండవు కానీ ఒక క్యారెక్టర్ పై చిన్న మెసేజ్ లాంటిది ఉంటుంది.

 

ఎం ఎస్ రాజు గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

నేను అయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఆయన సినిమాలో అంటే చాలా నెర్వస్ గా ఫీలయ్యాను. దాని వల్ల ఏమో కానీ ఫస్ట్ డే అయితే కెమెరా ముందు యాక్ట్ చెయ్యలేకపోయాను. దీనితో సర్ నన్ను పక్కకి తీసుకెళ్లి క్లాస్ ఇచ్చి ధైర్యం చెప్పారు. దానితో అక్కడ నుంచి అంతా సెట్ అయ్యింది.

 

రాజు గారికి మీకు ఏజ్ గ్యాప్ ఉంది ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా మిమ్మల్ని ఏమన్నా అడిగేవారా?

సర్ ఆల్రెడీ మొత్తం రీసెర్చ్ చేసి స్టోరీని సెట్ చేసుకున్నారు. అప్పుడప్పుడు ఏమన్నా అడిగేవారు కానీ ఆల్రెడీ ఆయనకి ఆల్రెడీ అంతా తెలుసు సినిమా సెట్స్ లో ఉన్నపుడు కూడా ఆ ఎనర్జీ అంతా యంగ్ గానే కనిపించేది.

 

ఫైనల్ గా ఆడియెన్స్ కి మీ రోల్ వరకు ఏం చెప్తారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?

డెఫినెట్ గా నేను చేసిన మంగళం క్యారెక్టర్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సినిమా చూస్తున్నంతసేపు పెదాలపై నవ్వు ఉంచుతాను. ప్రస్తుతం ఇంకో రెండు మూడు పైప్ లైన్ లో ఉన్నాయి. కానీ ఫస్ట్ ఈ సినిమా రిజల్ట్ కోసం చూస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు