ఇంటర్వ్యూ : దర్శకుడు యుగంధర్ – ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ లో ఆ ఎపిసోడ్ కి థియేటర్స్ లో సైలెన్స్ ఉండదు

Published on Aug 4, 2021 1:25 pm IST


ఇప్పుడు మన టాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉన్న వాటిలో రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఇప్పుడుకాక ఇంకెప్పుడు” సినిమా కూడా ఒకటి. మరి ఈ చిత్రం దర్శకుడు యుగంధర్ ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు మరి అవేంటో చూద్దాం రండి..

చెప్పండి ఈ కథ ఎలా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ చేశారు?

కిందటి సంవత్సరమే ఈ కథ రాసుకున్నాను అప్పటికే కంప్లీట్ అయ్యిపోయింది ఫస్ట్ వెవ్ తర్వాతే రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ రీరికార్డింగ్ లేట్ అవ్వడం వల్ల సెకండ్ వేవ్ కి దొరికిపోయాం సో అప్పుడు రిలీజ్ అవ్వలేదు అందుకే ఇప్పుడు చేస్తున్నాం.

మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు?

మాది వెస్ట్ గోదావరి జిల్లా పార్వతీపురం గ్రామం చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే ఇండస్ట్రీకి వచ్చి పద్నాలుగేళ్ళ పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రొడక్షన్ మేనేజర్ లో అలా వర్క్ చేశాను, సినిమాలంటే ప్రేమ ఉంది అందుకే వచ్చాను.

ఈ సినిమా ఆలోచన ఎలా మొదలయ్యింది ఇంకా కథలు ఏమన్నా ఉన్నాయా?

సంవత్సరం కితమే రాసుకున్నా, కానీ అంతకు ముందు పెద్ద హీరోల కోసం పెద్ద కథలు రాసుకున్నాను చాలా మందిని అప్రోచ్ అయ్యి మాట్లాడ్డం అన్నీ అయ్యాయి, కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోడానికి ఈ కథ రాసుకోవడం కొత్తవాళ్ళని పరిచయం చేస్తూ తక్కువ బడ్జెట్ లో చేయాలని ఈ సినిమా చేశాను.

మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పండి?

ఇది ఒక రోమ్ కామ్ ఎంటర్టైనర్ చిత్రం. అలాగే ఒక ఫీల్ గుడ్ మెసేజ్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది ఇంకా పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఉండే చిన్న సెన్సిటివ్ రిలేషన్ ని చూపించే ప్రయత్నం చేశాను అది రేపు మీరు థియేటర్స్ లో చూస్తారు ఎలా ఉంటుంది అన్నది.

‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ టైటిల్ సినిమాకి ఎలా జస్టిఫికేషన్ ఇస్తుంది?

మామూలుగా ఏ పని అయినా సరే అది చెయ్యాల్సిన సమయంలోనే మనం చెయ్యాలి, అలా కాకుండా ఏదో తొందరపాటు తోనో తెలియక చేస్తేనో దాని పరిణామాలు మారిపోతాయి ఆ కాన్సెప్ట్ నే ఈ సినిమాలో చూపించబోతున్నాను దానికి జస్టిఫికేషన్ నే ఈ టైటిల్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు.

టీజర్, ట్రైలర్స్ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువుందని టాక్ వచ్చింది అలాగే రీసెంట్ గానే ఇంకో కాంట్రవర్సీ దానిపై మీరేం చెప్తారు.?

అంటే ఈ సినిమాలో ఒక్క సీక్వెన్స్ మాత్రమే అలా ఉంటుంది దాన్ని రొమాంటిక్ గా తియ్యాలని చాలా ఎరోటిక్ గా ప్లాన్ చేశాను. నేను ఖచ్చితంగా చెప్పగలను అలంటి సీక్వెన్స్ ఇంకా ఎవరూ అటెంప్ట్ చెయ్యలేదు అది బోల్డ్ అని కూడా అనను ఎరోటిక్ అది రెండు వేరువేరు. యూత్ ని అట్రాక్ట్ చెయ్యాలని ట్రైలర్ లో ఆ సీన్స్ పెట్టాను కానీ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇంకా కాంట్రవర్సీ అయితే భజగోవిందం అనే లైన్ ట్రైలర్ లో వాంటెడ్ గా పెట్టలేదు. అందుకే ఇస్స్యూ అయ్యింది. అదే లైన్ లో ఉండే పాట రీసెంట్ గానే వచ్చింది దానికి ఎవరూ ఏమనలేదు. ఇప్పుడు అయితే అంతా సర్దుమణిగింది.

మరి హీరో హీరోయిన్ ఎలా చేసారు?

ఇద్దరూ బాగా చేసారు. హీరో హస్వంత్ వంగ తెలుగబ్బాయే అలాగే హీరోయిన్ నమ్రత డెర్కర్ ముంబై నుంచి వచ్చింది. ఇద్దరికీ ఈ సినిమానే డెబ్యూ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు.

మీరు ప్రొడక్షన్ కంట్రోల్ లో కూడా చేసారు మరి ఈ సినిమా బడ్జెట్ కంట్రోల్ లోనే అయ్యిందా దాటిందా?

మొత్తం అంతా అనుకున్నట్టే బడ్జెట్ కంట్రోల్ లోనే అయ్యింది. కానీ గోవాలో ఒక షెడ్యూల్ ని భారీ ఎక్విప్మెంట్ తో ప్లాన్ చేసాం అది కూడా కంట్రోల్ లోనే నడుస్తుంది అనుకునే లోపే హీరోయిన్ కి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అప్పటికే ప్యాకేజీ మాట్లాడుకున్న అంతా కట్టాల్సి వచ్చింది అలా ఒక 30 లక్షలు ఎక్కువయ్యింది.

మరి ఈ సినిమాలో హైలైట్ అంశాలు ఏంటి?

ఈ సినిమాలో రెండు మేజర్ ఎపిసోడ్ ఉంటాయి. వాటిలో స్టార్టింగ్ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది అది చూస్తే ఒక 6 నిమిషాలు అలా ఉంటుంది అలాగే ఆ 6 నిమిషాల్లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు సైలెన్స్ గా ఉంటుంది కానీ థియేటర్స్ లో మాత్రం అసలు సైలెన్స్ ఉండదు దాన్ని బట్టి అర్ధం చేసుకోండి ఈ సినిమా ఎలా ఉంటుందో.. 98 శాతం ఆడియెన్స్ ప్రతీ ఒక్కరినీ ఆ సీక్వెన్స్ అలరిస్తుంది.

మీ ప్రొడ్యూసర్ కోసం చెప్పండి ఎలా సపోర్ట్ చేశారు?

ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా వస్తుంది అంటే ప్రొడక్షన్ పరంగా తప్పిదాలు ఉండొచ్చు కానీ నా సినిమా విషయంలో మాత్రం నా ప్రొడ్యూసర్ నే ఇప్పటి వరకు నాకున్న ధైర్యం, అండ అని చెప్పగలను. శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ వారు ఇచ్చిన సపోర్ట్ నేను మర్చిపోలేను.

మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతానికి అయితే ఆరు కథలు ఉన్నాయి. ఆరు కూడా డిఫరెంట్ జానర్లు, చిన్న బడ్జెట్ కథలూ ఉన్నాయి పెద్ద బడ్జెట్ కథలు కలిపి ఆరు రెడీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :