ఇంటర్వ్యూ : డైరెక్టర్ రంజిత్ జయకోడి – “మైఖేల్” ఒక్క జానర్ సినిమా అని చెప్పడం కష్టం

ఇంటర్వ్యూ : డైరెక్టర్ రంజిత్ జయకోడి – “మైఖేల్” ఒక్క జానర్ సినిమా అని చెప్పడం కష్టం

Published on Jan 27, 2023 9:01 PM IST


ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి బజ్ తో ఉన్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా “మైఖేల్” కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం పట్ల ఆడియెన్స్ కి ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రంజిత్ జయకోడి లేటెస్ట్ గా వెబ్ మీడియా తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూ లో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పండి ?

మాది చెన్నై. దర్శకుడిగా మూడు సినిమాలు చేశాను. నా తొలి చిత్రం విజయ్ సేతుపతి గారితో చేశాను. తర్వాత హరీష్ కళ్యాణ్ తో మరో సినిమా చేశాను. మూడో సినిమా కూడా విడుదలకు సిద్ధమౌతుంది. ‘మైఖేల్’ నా నాలుగో చిత్రం.

 

చెప్పండి మరి ’మైఖేల్’ ప్రయాణం ఎలా మొదలైయింది ?

నా రెండో సినిమా చూసి సందీప్ కిషన్ కాల్ చేశారు. నా వర్క్ ఆయనకి చాలా నచ్చింది. అలా మేము మంచి స్నేహితులయ్యాం. లాక్ డౌన్ చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. సెకండ్ లాక్ డౌన్ సమయంలో ‘’మనం కలసి ఒక సినిమా చేద్దాం’’ అన్నారు. ఆయనకి అప్పటికి ఒక యాక్షన్ సినిమా చేయాలని వుంది. సరిగ్గా నేను కూడా ఆ సమయానికి యాక్షన్ స్క్రిప్ట్ రాస్తున్నాను. అలా ‘మైఖేల్’ మొదలైయింది.

 

’మైఖేల్’ గ్యాంగ్ స్టార్ కథనా ?

’మైఖేల్’ మూవీ ఒక జానర్ అని చెప్పలేం. రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్ స్టార్ డ్రామా, పిరియడ్ ఫిల్మ్ అనొచ్చు. ఇందులో 70, 80, 90 ఇలా మూడు కాలాలు వుంటాయి. ఎక్కువ భాగం 90లో వుంటుంది. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. గ్యాంగ్ స్టార్ డ్రామా వున్న బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది.

 

ట్రైలర్ చూస్తే మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టారనిపిస్తుంది.. రిస్క్ అనిపించలేదా?

ఈ విషయంలో మా నిర్మాతలు సునీల్ గారు, పుస్కూర్ రామ్ మోహన్ గారు, భరత్ గారి ప్రోత్సాహాన్ని అభినందించాలి. సినిమాని క్యాలిటీగా తీయడం పట్ల ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. ఫస్ట్ షెడ్యుల్ రష్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. బడ్జెట్ గురించి ఆలోచించ వద్దు.. స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నది తీమని చెప్పారు. వారి నమ్మకమే మైఖేల్ ని ఇంత బిగ్ ప్రాజెక్ట్ ని చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లో షూటింగ్ చేశాం. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. టీజర్, ట్రైలర్ కు అన్ని భాషల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాని కూడా అన్ని చోట్ల గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.

 

మైఖేల్ లోకి విజయ్ సేతుపతి ఎలా వచ్చారు?

విజయ్ సేతుపతి నాకు మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా ఆయనతోనే చేశాను. ఈ కథ కి పాన్ ఇండియా పాపులారిటీ వున్న ఒక స్టార్ కావాలి. నాకు తెలిసిన వారిలో విజయ్ సేతుపతి వున్నారు. ఈ పాత్ర గురించి చెప్పినపుడు ఆయనకి చాలా నచ్చింది. ఇందులో ఆయన పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

 

సందీప్ కిషన్ తో వర్క్ కోసం చెప్పండి?

సందీప్ కిషన్ ఎప్పటి నుండో తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది. నాకు ఏం కావాలో సందీప్ కి తెలుసు. తనకి స్క్రిప్ట్ పట్ల చాలా మంచి అండర్ స్టాండింగ్ వుంటుంది. తనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.

 

వరుణ్ సందేశ్ ని విలన్ గా చూపించాలనే ఆలోచన ఎవరిది ?

కథ రాసినప్పుడు ఆ పాత్ర కోసం వేరే నటుడు నా మనసులో వున్నారు. సందీప్ కిషన్, ఆ పాత్ర వరుణ్ కొత్తగా ఉంటాడు ఒకసారి ప్రయత్నించమని చెప్పారు. సందీప్ కి లవర్ బాయ్ ఇమేజ్ వుందని నాకు తెలుసు. కాస్త సందేహంతోనే ఆయన దగ్గరకి వెళ్లి స్క్రీన్ టెస్ట్ చేస్తానని కోరాను. వరుణ్ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. ఒక సీన్ ఇచ్చి స్క్రీన్ టెస్ట్ చేశాను. తొలి సినిమాకి ఆడిషన్ ఇస్తున్న ఆర్టిస్ట్ కు వున్న ఎనర్జీ వరుణ్ లో కనిపించింది. ఆ పాత్రలో నన్ను చాలా సర్ ప్రైజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతారు.

 

విజువల్స్ డార్క్ మూడ్ లో కనిపిస్తున్నాయి దీని కోసం ఏదైనా ప్రత్యేకమైన వర్క్ చేశారా?

ఎలాంటి విజువల్స్ కావాలో కథే డిమాండ్ చేస్తుంది. లైటింగ్, ఫ్రేమ్స్ కథ ప్రకారమే వస్తాయి. నా గత సినిమాల్లో కూడా కెమరాపనితనం భిన్నంగా వుంటుంది. మైఖేల్ సినిమాకి కిరణ్ కౌశిక్ చేశారు. డీవోపీగా ఇది ఆయన మొదటి సినిమా అంటే ఎవరు నమ్మరు. అద్భుతంగా చేశాడు. సినిమా మేకింగ్ స్టయిల్ లో నాపై ఫారిన్ చిత్రాల ప్రభావం వుంది. సినిమా సెట్స్ పైకి వెళ్ళే ముందే ఎలాంటి టోన్ లో ఉండాలనే దానిపై ప్రత్యేకంగా పని చేస్తాను.

 

సామ్ సి ఎస్ మ్యూజిక్ గురించి ?

సామ్ సిఎస్ నాకు మంచి స్నేహితుడు. నేనే పరిచయం చేశాను. మా మధ్య మంచి అనుబంధం వుంది. నా సినిమా అంటే కొంచెం ప్రత్యేక శ్రద్ద వుంటుంది. మైఖేల్ మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది.

 

మీ ప్రొడ్యూసర్స్ కోసం చెప్పండి

నిర్మాతల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు చాలా స్వీట్. వెరీ కేరింగ్. చాలా కంఫర్ట్ ఇచ్చారు. సినిమా, బిజినెస్ పట్ల వారికి గొప్ప నాలెడ్జ్ వుంది. బడ్జెట్ గురించి కాకుండా క్యాలిటీ గురించి ఆలోచిస్తారు.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ప్రస్తుతానికి యువసుధ ఆర్ట్స్ లో ఒక సినిమా, అలాగే కరణ్ సి నిర్మాణంలో మరో సినిమాకి సైన్ చేశాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు