ఇంటర్వ్యూ : నిర్మాత ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డి – “రాజా విక్రమార్క” కార్తికేయ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది

ఇంటర్వ్యూ : నిర్మాత ఆదిరెడ్డి, ’88’ రామారెడ్డి – “రాజా విక్రమార్క” కార్తికేయ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది

Published on Oct 31, 2021 5:22 PM IST


టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డితో ఇంటర్వ్య ఇచ్చారు. మరి ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

ముందు మీ కోసం అసలు మీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పండి

మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో గల వెదురుపాక గ్రామం. ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారిది మా ఊరే. డిగ్రీ వరకూ మా ఊరిలో చదువుకున్నాను. తర్వాత వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా వెళ్లాను. ’88’ రామారెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం. ఎస్వీ కృష్ణారెడ్డిగారు మా ఊరివాసులే.

ఇద్దరిదీ తూర్పు గోదావరి జిల్లా. ముందునుంచి పరిచయం ఉందా? సినిమాల్లోకి వచ్చాక కలిశారా?

వ్యాపారంలో మేమిద్దరం స్నేహితులం. మా గ్రామాలు కూడా పక్కన పక్కనే. సినిమాల్లోకి రాకముందు నుంచి స్నేహం ఉంది.
’88’ రామారెడ్డి: ముందు వ్యాపారంలో కలిశాం. ఆ తర్వాత మా మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని తెలిసింది. పదేళ్లకుగా పైగా మా బంధం కొనసాగుతోంది.

మరి ఈ సినిమా ఎలా మొదలైంది?

వినోద్ రెడ్డిగారు అని మా ఊరిలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 200ల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మా ఆదిరెడ్డిగారికి చెప్పాను. ఇద్దరికీ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. నిర్మాతగా ‘రాజా విక్రమార్క’ నా తొలి సినిమా. మా ఆదిరెడ్డిగారు ఇంతకు ముందు కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఓ సినిమా విడుదల చేసిన అనుభవం ఉంది.

ఆదిరెడ్డిగారు ఇంతకు ముందు ఏయే సినిమాలు చేశారు?

ఉత్తరాంధ్రలో ‘బాద్ షా’, ‘గబ్బర్ సింగ్’, ‘గ్యాంబ్లర్’ తదితర సినిమాలు చేశా. పంపిణీదారుడిగా శ్రీకాంత్ గారు నటించిన ‘రంగా… ది దొంగ’ నా తొలి సినిమా. ఆ తర్వాత ధనుష్, కీర్తీ సురేష్ జంటగా నటించిన ‘రైల్’ సినిమా తెలుగు హక్కులు తీసుకున్నాను. తెలంగాణ, ఆంధ్రాలో రిలీజ్ చేశా. నిర్మాతగా నా తొలి చిత్రమది. ‘రాజా విక్రమార్క’… నిర్మాతగా నా రెండో సినిమా. ఆల్రెడీ గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో మంచి సినిమా చేయాలని కొంత విరామం తీసుకున్నాను.

ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?

టీజర్ విడుదల చేసినప్పుడు రెండు మూడు మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకున్నాం. కానీ, ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వ్యూస్ పక్కన పెడితే… టీజర్ చాలా స్టయిలిష్, రిచ్ గా ఉందని చెబుతున్నారు. హాలీవుడ్ స్టయిల్ లో ఉందని కొందరు ఫోనులు చేయడం సంతోషంగా ఉంది. మా దర్శకుడు శ్రీ సరిపల్లి హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేశాడు. ఆ అనుభవంతో మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు. మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయకముందు నుండి మంచి బజ్ నెలకొంది. హిందీ రైట్స్ ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుండి ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత టాప్ క్లాస్ అని చెబుతున్నారంతా.

ఇక రాబోయే ట్రైలర్ ఎలా ఉండబోతుంది?

ట్రైలర్ మాత్రమే కాదు… సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుంది. న్యూ ఏజ్ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి.

కార్తికేయ గురించి చెప్పండి?

హీరోగా వందకు రెండొందల శాతం కష్టపడతారు. వ్యక్తిగా అయితే… ఆయన గురించి మాటల్లో చెప్పలేం. అంత మంచి మనిషి. కరోనా రెండు దశలను దాటుకుని మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కార్తికేయ. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.

కరోనా కాలంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారా? ఇప్పుడు థియేటర్లలో విడుదల పరంగా చేయాలని ఏమైనా?

థియేట్రికల్ అనుభూతి ఇవ్వడం కోసం తీసిన చిత్రమిది. అందుకని, ఓటీటీలో విడుదల చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. థియేటర్లలో విడుదల పరంగా మాకు ఇబ్బందులు ఏమీ లేవు. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు అమ్మేశాం. కొన్ని ఏరియాలు మా దగ్గరే ఉన్నాయి. వాటికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
’88’ రామారెడ్డి: సినిమా మీద మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే… నైజాం ఏరియాలో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.

‘రాజా విక్రమార్క’ తర్వాత మీరు చేయబోయే సినిమా?

రెండు బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. త్వరలో వివరాలు వెల్లడిస్తాం.అన్నీ కుదిరితే ‘రాజా విక్రమార్క’ సక్సెస్ మీట్ లో కొత్త సినిమా ప్రకటిస్తాం.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు