ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – “అల్లూరి” సినిమా వల్ల నాలో కూడా చాలా మార్పులు వచ్చాయి

ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – “అల్లూరి” సినిమా వల్ల నాలో కూడా చాలా మార్పులు వచ్చాయి

Published on Sep 20, 2022 6:15 PM IST

 

తన టాలెంట్ తో చిన్న చిన్న పాత్రలు నుంచి హీరో వరకు ఎదిగిన టాలీవుడ్ యంగ్ హీరోస్ లో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కూడా ఒకరు. మరి తాను లేటెస్ట్ గా నటించిన సాలిడ్ పోలీస్ డ్రామా “అల్లూరి”. దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ వారం రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఇపుడు ప్రమోషన్స్ లో భాగంగా హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

 

చెప్పండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది?

ఈ సినిమాలో కనిపించే “అల్లూరి” అనే పోలీస్ క్యారెక్టర్ మాత్రమే ఫిక్షనల్ గా తీసుకున్నాం కానీ సినిమాలో చాలా సంఘటనలు అయితే మన ఆంధ్ర ప్రదేశ్ లో అలాగే ఇండియాలో చాలా చోట్ల జరిగిన సంఘటనలు నిజమైన వాటిని చేసిన కొందరు పోలీసుల ఆధారంగా అల్లూరి పాత్రపై డిజైన్ చేసింది. అలాంటి పోలీస్ ఒక పది నుంచి పదిహేను ఏళ్ళు పోలీస్ గా ఉండి ఏం చేసాడు అనేది ఇందులో కనిపిస్తుంది.

 

ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు ఉన్నాయి ఈ సినిమా డిఫరెంట్ గా ఉంటుంది?

అవును ఈ టైప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా వాటి లానే ఉంటుంది. ఫస్టాఫ్ వరకు హీరో పాత్రపై అతనెలా ఉంటాడు? సెకండాఫ్ లో పోలీస్ సిస్టం కోసం ఉంటుంది.

 

ఈ పాత్ర వల్ల మీలో ఏమన్నా మార్పు వచ్చిందా?

ఈ సినిమా చేసాక నాలో చాలా మార్పులు వచ్చాయి. మాములుగా నేను చాలా నెమ్మదిగా మాట్లాడుతాను కానీ ఈ సినిమా చేసాక చాలా సార్లు బయట కూడా పోలీస్ గానే ఫీల్ అయ్యిపోయేవాడిని, మామూలుగా చాలా నెమ్మదిగా మాట్లాడుతాను కానీ చాలా సార్లు కొన్ని ఇన్సిడెంట్స్ చూసి తెలీకుండానే గట్టిగా మాట్లాడుతున్నాను. ఇలాంటి ప్రభావం ఈ అల్లూరి రోల్ నాలో తీసుకొచ్చింది.

 

అల్లు అర్జున్ గారు మీకోసం చాలా మాట్లాడారు దానికోసం చెప్పండి?

బన్నీ గారితో నాకు పదేళ్ల నుంచి మంచి రాపో ఉంది. కానీ ఎప్పుడు కూడా నా సినిమా కోసం ఇలా రండి అని ఎప్పుడూ ఎవరినీ అడగలేదు, అడగాలి అనుకోలేదు. నేనే ఓ వర్క్ లో ఉంటే ఫోన్ ఎత్తలేను అలాంటిది అంత పెద్ద వ్యక్తి ఇంకెంత బిజీగా ఉంటారు.? అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. కానీ ఈ సినిమాకి కొత్త ఆడియెన్స్ కావాలి అందుకు నా ఒక్కడి బలం సరిపోదు అందుకే బన్నీ గారిని పిలిచిన వెంటనే తాను లేదు అనకుండా సపోర్ట్ చేశారు. అలాగే నాని అన్న కానీ రవితేజ గారు కానీ అదే విధంగా అడిగిన వెంటనే సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.

 

డైరెక్టర్ కోసం చెప్పండి?

డైరెక్టర్ ఈ కథ తెచ్చినప్పుడు ఇది నాకోసమేనా అనుకున్నాను. నేను ఎలాగో కొన్ని సినిమాలు చెయ్యకూడదు అనుకున్న వాటిలో పోలీస్ సినిమాలు కూడా ఒకటి. అలాగే తనని చెప్పమన్నాను కానీ తాను మాత్రం మంచి నరేటర్. కథ చాలా బాగా చెప్పాడు ఫైనల్ గా నాకు నచ్చి ఓకే చేశాను.

 

మీ ప్రతి సినిమాలో కొత్త హీరోయిన్ కనిపిస్తారు కావాలని పెడతారా?

కొత్త హీరోయిన్స్ అంటే కావాలని ఎప్పుడు అనుకోలేదు వేరే హీరోయిన్స్ అయితే కొంతమంది డేట్స్ పరంగా ఇబ్బందులు రావొచ్చు. అదే కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి మనం ముందే చెప్పొచ్చు ఇది చేస్తున్నప్పుడు వేరే ప్రాజెక్ట్ ఏమన్నా కమిట్ అయితే మాకు కూడా ఓసారి చెప్పమనడానికి బాగుంటుంది. అంతే తప్ప కావాలని వేరే వాళ్ళతో చెయ్యకూడదు అని ఏం లేదు.

 

ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

ఒక మూడు సినిమాలు అయితే ఉన్నాయి. హసిత్ తో ఒకటి మైత్రి మూవీస్ మేకర్స్ లో ముందు అది స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ యూవీ క్రియేషన్స్ లో హుషారు డైరెక్టర్, ఓ కొత్త డైరెక్టర్ తో అనీల్ సుంకర గారితో సినిమా చేస్తున్నాం. ఓ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్ అని కాదు కానీ ఓ కొత్త డైరెక్టర్ యూరోపియన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ టైప్ లో యూనివర్సల్ కాన్సెప్ట్ మన నుంచి వచ్చినట్టు ఉంటుంది. ప్రస్తుతానికి దానిపై తాను వర్క్ చేస్తున్నాడు. దీని కోసం తర్వాత మంచి టైం చూసి అనౌన్స్ చేస్తాము. ఇంకా నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు