ఇంటర్వూ: మేఘా ఆకాష్ – రాజ రాజ చోర లో అదే నా ఫేవరేట్ సీన్!

ఇంటర్వూ: మేఘా ఆకాష్ – రాజ రాజ చోర లో అదే నా ఫేవరేట్ సీన్!

Published on Aug 13, 2021 2:19 PM IST

ఈ సినిమా తో ఎలా అసోసియేట్ అయ్యారు?

లాక్ డౌన్ సమయం లో ఇది జరిగింది. ఇది చాలా ఆసక్తికరం గా ఉంది, ఎందుకు ఒకసారి వినకూడదు అని టీమ్ అడగగా, విన్నాను. ఇప్పటి వరకూ నేను విన్న దాంట్లో చాలా డిఫెరెంట్ గా అనిపించింది. హీరో హీరోయిన్ అని కాకుండా, ఈ చిత్రం లో ప్రతి క్యారెక్టర్ కూడా ఆసక్తి గా అనిపించింది. కథ చాలా డిఫెరెంట్ గా ఉంది, పాత్ర కూడా చాలా డిఫెరెంట్ గా అనిపించడం తో ఒప్పుకున్నా.

ఈ చిత్రం ఎన్నుకోవడానికి ఎగ్జైటింగ్ అనిపించిన అంశం ఏది?

ఈ పాత్ర చాలా రియల్ గా ఉంటుంది. విష్ణు, సునైన ఇలా ప్రతి ఒక్కరి పాత్ర చాలా బాగా నచ్చింది. చాలా నిజం గా అనిపించింది. అంతేకాక చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితానికి ఈ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. సినిమాల్లో మాత్రమే మనం అలా జీవించగలం. ఇంతకుముందు నేను చేసిన రెండు పాత్రలు చాలా డిఫెరెంట్. కానీ ఇందులో హీరో, హీరోయిన్ అని కాకుండా కథకి అనుగుణంగా సినిమా ఉంటుంది.

శ్రీ విష్ణు తో పని చేయడం ఎలా ఉంది?

నేనే అంటే నాకంటే సిగ్గు పడుతున్నారు. చాలా సైలెంట్ గా ఉన్నారు. మొదటి సారి చూసినప్పుడు సైలెంట్ గా, సిగ్గు పడుతూ ఉన్నారు. నేను బేసిక్ గా ఎక్కడా అంతగా మాట్లాడను. కానీ శ్రీ విష్ణు ను చూశాక ముందు నేనే వెళ్లి మాట్లాడాను. మాట్లాడుతుంటే చాలా తక్కువగా మాట్లాడతారు అనిపించింది. అంతేకాక చాలా ఫన్ పర్సన్ విష్ణు.

తెలుగు లో గ్యాప్ వచ్చింది మధ్యలో, ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు!

అనుకోని వచ్చిన గ్యాప్ కాదు. నాకు తెలుగు, తమిళం, మలయాళం తెలుసు. భాషను బట్టి నేను స్క్రిప్ట్ ఎంచుకోను, కధ వింటాను, నచ్చితే చేస్తాను. ఇలా వింటూ నచ్చిన కథలని చేస్తున్నాను. అంతకు ముందు ఇలాంటివి చేయాలి, ఇలాంటివి వద్దు అని పర్టిక్యులర్ గా ఉండకుండా, మైండ్ సెట్ ప్రస్తుతం చేంజ్ అయింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అనుకుంటున్నా. నా కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి డిఫెరెంట్ పాత్రలు చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు కథలు వినడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నా.

తెలుగు సినిమాలు చేసేప్పుడు నాన్న గారి సలహాలు, సూచనలు ఏమైనా తీసుకుంటారా?

లేదు. అమ్మగారు నాతో కథ వింటారు. కానీ చివరగా నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటా.

ప్రస్తుతం మనం కరోనా టైమ్ లో ఉన్నాం. ప్రేక్షకులు చాలా కచ్చితంగా సినిమాలను ఎన్నుకొని చూస్తారు. ఈ సినిమాను ఎందుకు చూడాలి?

ఈ సినిమా చాలా వినోదాత్మకంగా సాగుతుంది. చాలా సరదాగా ఉంటుంది. ప్రతి ఒక్కరి పెదాల పై నవ్వు ఉండేలా సినిమా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా మనందరికీ చాలా అవసరం.

ఈ కథ చాలా డిఫెరెంట్ ఉన్నప్పుడు, క్రాఫ్ట్ అంతా ఎలా నమ్మారు?

ఈ కథ విన్నప్పుడు చాలా ఊహించుకున్నా. చాలా ఆసక్తికరంగా అనిపించింది. కథ విన్నప్పుడు దర్శకుడు ఏం చెప్తున్నాడు అన్న దానికి ఒక విజన్ ఉంది అని నమ్మాను.షూటింగ్ అనుభవం చూస్తున్నప్పుడు కూడా కొత్త దర్శకుడు తో చేస్తున్నా అనే ఫీల్ రాలేదు.

టీజర్ లో శ్రీ విష్ణు క్యారెక్టర్ లో కొంచెం ఫన్ ఉంది. మీ క్యారెక్టర్ లో కూడా అలా కామెడీ ఉంటుందా?

అందరి పాత్రల్లో కొంచెం కామెడీ ఉంటుంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

నీ పాత్ర పేరేంటి సినిమాలో?

సంజన. సినిమా లో ఎక్కువ సేపు విష్ణు తో ఉంటుంది. అతని తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది.

సినిమా లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఇప్పటి దాకా నేను చేసిన పాత్రల్లో సంజన పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా లో తను ఏదైతే కావాలి అనుకుంటుందో అది చేసే అమ్మాయి లా ఉంటుంది.

హీరో హీరోయిన్ అంటే పర్టిక్యులర్ గా ఉంటాయి. కానీ ఈ చిత్రం లో అందరూ కూడా వారి ఫ్లో లో వెళ్తుంటారు. చాలా డిఫెరెంట్ గా, రియల్ గా ఉంటుంది. చాలా అందంగా తెరకెక్కించడం జరిగింది.

ఈ సినిమా లో బాగా నచ్చిన సీన్?

విష్ణు కి నాకు టెంపుల్ లో ఒక సన్నివేశం ఉంది. ఆ సీన్ లో విష్ణు చాలా బాగా చేశారు. నవ్వు ఆపుకొలేక పోయాను. ఈ సినిమా లో అదే నా ఫేవరేట్ సీన్.

నిన్న ఒక సాంగ్ విడుదల అయ్యింది!

చాలా డిఫెరెంట్ గా ఉంది నేను చేసిన పాటలు అన్నిటిలో. ఆ సాంగ్ లో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం జరిగింది.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంటి?

తెలుగు లో డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, మను చరిత్ర ఇప్పుడు రాజ రాజ చోర. ఇంకా తమిళం లో చేస్తున్నా.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు