ఇంటర్వ్యూ: సిరివెన్నెల మొత్తం కథను పాటలో చెప్పారు – నాని

Published on Dec 22, 2021 5:21 pm IST

రెండేళ్ల తర్వాత థియేటర్ల లోకి వస్తున్నా, వేరే ఆప్షన్స్ లేక లాక్ డౌన్ టైం లో చేసిన సినిమాలు ప్రేక్షకులకు అందించే ఉద్దేశ్యం తో ఓటిటి లో విడుదల చేయడం జరిగింది. నాక పర్సనల్ గా ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్ల లో చూడటం ఇష్టం. ఆ సత్యం థియేటర్ లో చూసేవాడిని. మళ్ళీ రెండేళ్ల తర్వాత థియేటర్ల లోకి వస్తున్నా.

 

కథ లో చాలా దమ్ము ఉండాలి పీరియాడిక్ సినిమాలు అంటే. కథ చాలా బాగుంది కాబట్టే చేశా. పర్ఫెక్ట్ దారి దొరికింది. ఇలాంటి సినిమా చేయాలి అంటే కథ, ఆర్టిస్టు లు ఉంటే సరిపోదు. మంచి టెక్నీషియన్స్ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు మాత్రమే మనం కన్విన్సింగ్ గా క్రియేట్ చేయగలం. ఈ చిత్రం విషయం లో అన్ని డిపార్ట్ మెంట్స్ నుండి 200 పర్సెంట్ సపోర్ట్ వచ్చింది. సినిమా మీరు చూస్తున్నంత సేపు ఏదో సెట్స్ లో ఉన్నట్లు కాకుండా, మీరు ఆ టైమ్ లో ఉంటే ఎలా ఉంటుందొ అలా అనిపిస్తుంది.

ఈ చిత్రం తో చాలా మెమరిస్ ఆటాచ్ అయ్యి ఉన్నాయి. ఫైనల్ ప్రొడక్ట్ ఒక్కసారి చూసుకున్నాక మళ్ళీ రీ రన్ అయ్యాయి మైండ్ లో. చాలా కాన్ఫిడెంట్ గా, హ్యాపీ గా ఉన్నాం.

నా గెటప్ కోసం చాలా మంది చాలా చేశారు. నా వర్క్ తక్కువ. బోల్డంత హోమ్ వర్క్ చేసి, శ్యామ్ సింగరాయ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఫ్లోర్ మొత్తం చార్ట్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఉండే జూనియర్ ఆర్టిస్టు లకి కూడా చాలా వర్క్ చేశారు. ఆడిషన్స్ చేశారు.

 

కథ విన్న తరువాత మీ ఫీలింగ్ ఎంటి? ఎన్ని రోజులు పట్టింది ఆ పాత్రలో కి వెళ్ళడానికి?

ఫస్ట్ నెరేషన్ అయిన వెంటనే చేస్తా అని చెప్పా. అనుకున్నది అనుకున్నట్లు గా తీయగలిగితే ఇదొక గొప్ప సినిమా అయిపోతది. ఆ పాజిబులిటీ ఉన్నది కాబట్టే వెంటనే ఓకే చేశా. రోల్స్ లోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నాలుగున్నర నెలలకి షూటింగ్ స్టార్ట్ చేశాం. అది ఓకే చేసినప్పుడు వేరే షూటింగ్ లో ఉన్నా.

 

స్క్రిప్ట్ లో ట్రిగ్గర్ పాయింట్ ఏది?

చాలా ఉన్నాయి. నాలుగు మూమెంట్స్ ఉన్నాయి. గూస్ బంప్స్ అంటారు కదా, ఎమోషనల్ గా ఒక స్టన్ సిచువేషన్ లో వదిలేసే పరిస్థితులు నాలుగు ఉన్నాయి. ఆ నాలుగు చాలా బావుంటాయి. మొత్తం కథ మీద చాలా ప్రభావం చూపిస్తుంది.

 

రాహుల్ తో మీకు ఎలా అనిపించింది?

అతను డెబ్యూ కాదు. జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ లో ఒక క్వాలిటీ చూశా, సేమ్ రాహుల్ లో ఉంది. చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అవ్వడం, ఆ ఏజ్ లో చాలా తక్కువగా చూస్తాం. రాహుల్ తనకు ఏం కావాలో అన్ని చేయించుకున్నారు. అంతేకాక తనకి లిటరేచర్ పై మంచి గ్రిప్ ఉంది. ఇంక పీరియాడిక్ సినిమా అంటే ఏ రేంజ్ లో వచ్చి వుంటుందొ ఆలోచించండి.

శ్యామ్ నాన్న బెంగాలీ, అమ్మ తెలుగు. శ్యామ్ ఎప్పుడూ కూడా తెలుగే మాట్లాడుతూ ఉంటాడు. కానీ బెంగాలీ డైలాగ్స్ వాడక పోతే ఆ ఫీలింగ్స్ రాదు.

 

శ్యామ్ పోరాటం ప్రేమ కోసమా, వేరేనా?

పోరాటం చెడు మీద. చెడు రకరకాలు గా ఉండవచ్చు. దేవదాసి వ్యవస్థ కూడా ఒక ఎలిమెంట్.దురాచారాలు, మూడ నమ్మకాలు 1960స్ లో ఎక్కువగా ఉండేవి. దేవదాసి తనం, అంటరాని తనం, క్యాస్ట్, అలా చాలా ఉండేవి. ఇతను కమ్యునిస్ట్. ఎదురు తిరగడం అనేది ఇన్ బిల్ట్ క్వాలిటీ. ఇతను లవ్ లో పడితే ఏంటి. శ్యామ్ సింగ రాయ్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎపిక్ లవ్ స్టోరీ. ఇది ఫిక్షనల్ పాత్ర. ఈ సినిమా కోసం చాలా మంది బెంగాలీ లు ఎదురు చూస్తున్నారు.

నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎం సి ఎ, వి, టక్ జగదీష్ లకి అమెజాన్ ప్రైమ్ వాళ్లకు భారీగా సబ్ స్క్రిప్షన్స్ వచ్చాయి. కేక్స్ కూడా కట్ చేయించారు. ప్రస్తుతం ఓటిటి లు నడుస్తున్నాయి. థియేటర్ల కోసం దాయాల్సిన అవసరం లేదు. నా పని సినిమాలు చేసుకొవడం, కానీ థియేటర్ల లోకి వస్తా అని తెలుసు నాకు రిజల్ట్ హ్యాపీ గా ఉండాలి. పని చేసిన వాళ్ళు హ్యాపీ గా ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వలన చాలా మందికి పని దొరుకుతుంది. ఇది ఆగకూడదు.అల నేను ముందుకు వెళ్తూ ఉంటా.

శ్యామ్ బ్రిలియంట్ స్క్రిప్ట్. చూసేసాను. జెర్సీ కి ఎలా ఉందో కాన్ఫిడెంట్ ఇప్పుడు కూడా సేమ్.

 

కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినీమా.

ప్రతి సినిమా కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ ఏ. అష్టా చెమ్మా, అలా మొదలైంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఏ. గ్రోత్ ఎప్పుడు కాన్స్టాంట్ గా ఉండాలి.

కృతి చాలా కొత్త, పెద్దగా తెలుగు సినిమా లు కానీ, ఇండస్ట్రీ గురించి ఎక్కువగా అడుగుతూ ఉండేది. చాలా ఇంట్రస్ట్. అలాంటి క్వాలిటీ ఈ టైమ్ లో ఉంది అంటే గుడ్ తింగ్ అది.

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట గురించి

సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట లిరిక్స్ పంపినప్పుడు సిరివెన్నెల అని పెట్టాం, ఇది లాస్ట్ పాట అవ్వొచ్చు అని సరదాగా అన్నారు. కానీ ఇది బ్యూటిఫుల్ సాంగ్. కానీ ఆయన మొత్తం కథ ఆ పాటలో చెప్పారు. అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఒకసారి సినిమా చూశాక పాట వినండి. మొత్తం కథ చెప్పారు. అలాంటి లిరిక్స్ రైటర్ లేరు ప్రపంచం లో. ప్రణవలయ పాట రాసిన విధానం చాలా బావుంటుంది. ఒక లెజెండ్ పర్సన్ ను సెలబ్రేట్ చేసుకొని బాధ్యత మా మీద ఉంది. ఇది ఎమోషనల్ ఎలిమెంట్ మాకు.

సంబంధిత సమాచారం :