ఇంటర్వ్యూ : నివేదా పేతురాజు – కథ విన్నప్పుడే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను !

Published on Aug 9, 2021 6:19 pm IST

 

“ఫలక్ నమా దాస్” హిట్ చిత్రాలతో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తోన్న సినిమా ‘పాగల్’. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ – దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..

 

పాగల్ గురించి, అలాగే ఈ సినిమాలో మీరు అసలు ఎలా భాగమయ్యారు ?

ఈ స్క్రిప్ట్ నాకు రెండు సంవత్సరాల క్రితమే చెప్పారు. చెన్నై వచ్చి నరేష్ గారు ఈ సినిమా కథ నాకు చెప్పారు. మొదటిసారి కథ విన్నప్పుడే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. లాక్ డౌన్ తరువాత దిల్ రాజుగారు కూడా ఈ కథ గురించి మాట్లాడారు. ఆయనకు కథ బాగా నచ్చింది. ఆయన ఇచ్చిన భరోసాతో ఈ సినిమాని పూర్తి చేశాము.

 

మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు ?

ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. కానీ మధ్యలోనే కొన్ని వర్డ్స్ మిస్ అవుతాయి.

 

దర్శకుడు కథను ఎంత బాగా చెప్పారో.. అంతే బాగా సినిమాగా తీశారా ?

కరెక్ట్ గా చాలా బాగా తీశారు. డైరెక్టర్ ఏమి చెప్పారో అదే తీశారు. డైరెక్టర్ గారు కొన్ని సీన్స్ చెప్పినప్పుడు నేను రియల్ గా ఏడ్చాను.

 

కథలో అంత ఎమోషన్ ఉందా ?

నాకు ఐదు సార్లు కథను నేరేట్ చేశారు. కథ విన్న ప్రతిసారి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. సినిమా చూసినప్పుడు కూడా నేను అంతే ఎమోషనల్ అయ్యాను.

 

సినిమాలో మీ పాత్ర గురించి ?

నా క్యారెక్టర్ కొంచెం సీరియస్ గా ఉంటుంది, అలాగే లవ్ ఫీల్ తో సాగుతుంది.

 

మీరు ఎక్కువగా ఎందుకు సీరియస్ క్యారెక్టర్స్ నే సెలెక్ట్ చేసుకుంటారు?

నాకు నిజంగా తెలియదు అండి. బహుశా నా లుక్స్ అండ్ నా బిహేవియర్ చూసి నాకు సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని అవే ఇస్తున్నారు. అందుకే, అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నాయి.

 

ఈ సినిమా మ్యూజిక్ గురించి ?

సాంగ్స్ అన్నీ బాగుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ రధాన్ గారు సాంగ్స్ అన్నీ బాగా కంపోజ్ చేశారు.

 

 

పాగల్ నిర్మాతల గురించి ?

బెక్కెం వేణుగోపాల్ గారు చాలా డౌన్ డౌన్ టు ఎర్త్ పర్సన్. కథ చెప్పిన ప్రతిసారి ఆయన కూడా వచ్చారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. అలాగే దిల్ రాజుగారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆయన నిర్మాణంలో నేను గతంలో కొన్ని సినిమాలు చేశాను.

 

భవిష్యత్తు ప్రాజెక్ట్ ల గురించి ?

తెలుగులో ఒక సినిమా చేసున్నాను. అలాగే తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

సంబంధిత సమాచారం :