ఇంటర్వ్యూ : రష్మిక మందన్నా – శ్రీవల్లి ఉన్నదే పుష్పరాజ్ కోసం !

Published on Dec 13, 2021 4:36 pm IST

 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా, ఈ క్రేజీ హీరోయిన్ ఎక్స్ క్లూజివ్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. మరి రష్మిక చెప్పిన ముచ్చట్లు మీ కోసం.

 

ముందుగా ‘పుష్ప’ చిత్రం గురించి చెప్పండి ?

పుష్ప పూర్తిగా మరో ప్రపంచం అండి. చాలా కొత్తగా క్యాచీగా ఉంటుంది. కచ్చితంగా పుష్పను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పుష్ప అంటే మరో వరల్డ్. నాలుగు సినిమాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకే పడింది మా టీమ్. అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది.

 

కొత్త వరల్డ్ అంటున్నారు. ఈ కొత్త వరల్డ్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

పుష్పలో పుష్పరాజ్‏కు ప్రేయసి అయిన శ్రీవల్లి పాత్రలో నేను నటించాను. ఇక శ్రీవల్లి పాత్ర విషయానికి వస్తే తను కొంచెం కన్నింగ్ అండ్ క్యూట్, ఇక శ్రీవల్లి ఉన్నదే పుష్పరాజ్ కోసం. శ్రీవల్లి పాత్ర చాలా బాగుంటుంది. చాలా కొత్తగా కూడా ఉంటుంది.

 

అసలు పుష్ప కథ ఫస్ట్ టైమ్ విన్నప్పుడు మీకేం అనిపించింది ?

సుక్కు సర్ నాకు అసలు కథ చెప్పరు (నవ్వుతూ). అయితే, ఈ సినిమాకి డైరెక్టర్ సుక్కు సర్. ఆయన గురించి మనందరికీ తెలుసు. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్స్ చూశాను. చాలా గర్వంగా అనిపించింది. ఆ క్రెడిట్ మొత్తం సుక్కు సర్ కే దక్కుతుంది.

 

శ్రీవల్లి పాత్ర కోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ?

అన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేశాను అండి. చిత్తూరు స్లాంగ్ నేర్చుకున్నాను. కానీ సెట్ లో డైలాగ్స్ మారినప్పుడు, అలాగే సీన్స్ లో మార్పులు వచినప్పుడు కూడా యాసను నేర్చుకుంటూనే ఉన్నాను. శ్రీవల్లి పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తోంది.

 

‘సామీ సామీ’ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ చేసేటప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు ?

నిజానికి నాకు సామీ సామీ సాంగ్ చేయడం చాలా కష్టం అయింది అండి. ఎందుకంటే.. డ్యాన్సింగ్ ఒకలా ఉంటుంది, అలాగే మూమెంట్స్ ఎమోషన్ మ్యాచ్ చేయాలి. పైగా సాంగ్ లో మరో డిఫరెంట్ లెవల్ ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది.

 

మహేష్ తో నటించారు. ఇప్పుడు బన్నీతో నటించారు. ఎలా అనిపించింది ? వాళ్ళ గురించి ఏం చెబుతారు ?

వాళ్లిద్దరూ పెద్ద స్టార్స్. అండ్ ఇద్దరూ డిఫరెంట్ పర్సన్స్. అలాగే ఇద్దరి వర్కింగ్ స్టైల్స్ కూడా వేర్వేరుగా ఉంటుంది. నా వరకు అయితే, నేను మహేష్ సర్ దగ్గర నుంచి కొన్ని కోర్చుకున్నాను. అలాగే బన్నీ గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను.

 

మీ కెరీర్ పై మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ?

మా అమ్మ ఎప్పుడు చెప్పే మాట.. ఎక్కువ వర్క్ చేయకు అని, ఇలా చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. బట్, నేను ప్రస్తుతం ఇంత హ్యాపీగా, ఇంత జాలీగా వర్క్ చేస్తున్నాను అంటే.. కారణం మా పేరెంట్స్ నే.

 

సమంత ఈ సినిమా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. భవిష్యత్తులో మీరు కూడా అలాంటి సాంగ్స్ చేస్తారా ?

లేదు అండి. బట్, సామ్ చేసిన సాంగ్ లో ఆమె లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. అలాగే సమంత డ్యాన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ సాంగ్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

 

పుష్ప 2 ఎప్పుడు రాబోతుంది ?

నాకు తెలియదు అండి. మీరు ఆ విషయం సుక్కు సర్ నే అడగాలి అంటూ రష్మిక ఇంటర్వ్యూ ముగించింది.

 

సంబంధిత సమాచారం :