ఇంటర్వ్యూ : విశ్వక్ సేన్ – ‘పాగల్’ సినిమా ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది..నా మాట వెనక్కి తీసుకోను

Published on Aug 13, 2021 2:51 pm IST


ఇప్పుడు టాలీవుడ్ లో మంచి రైజింగ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. తన స్టార్టింగ్ సినిమాలతోనే తెలుగు యూత్ లో మంచి మార్క్ సెట్ చేసుకున్న విశ్వక్ నటించిన లేటెస్ట్ చిత్రం “పాగల్”. రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు రిలీజ్ కి రెడీగా ఉండగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ ని ఇచ్చాడు. మరి మాస్ కా పాగల్ ఎలాంటి విషయాలు చెప్పాడో ఇప్పుడు చూద్దాం రండి.

చెప్పండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది.?

ఫస్ట్ ఐదు నిమిషాల్లో సినిమా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. ఓ చిన్న కుర్రాడికి తన తల్లి చెప్పే మాటతో మళ్ళీ తనని అంతగా ప్రేమించేలా ఎవరు దొరుకుతారు అనే ఒక అన్ కండీషనల్ లవ్ కోసం ఆ కుర్రాడు వెతుకుతుంటాడు. నేను నిజంగా చెప్తున్నా ప్రతీ ఒక్కరినీ కూడా ఈ సినిమా కదిలించేస్తుంది.. గుండెల్లో పెట్టుకుంటారు ఈ సినిమాని.. థియేటర్ నుంచి ఇంటికి వచ్చినా తర్వాత కూడా ఈ సినిమా కోసం చెప్పకుండా ఉండలేరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ మాటలు బాగా వైరల్ అయ్యాయి మీ కాన్ఫిడెన్స్ ఏంటి?

అవును, అక్కడ చెప్పిన ఏ ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకోను అలాగే రేపు రిలీజ్ అయ్యే వరకు కూడా.. నా సినిమా చూసుకొనే నా కాన్ఫిడెన్స్ అంతా.. నిన్ననే నా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ వారి ఫ్రెండ్స్ కూడా సినిమా చూసి ఒక్క మాటే అన్నారు. నువ్ మళ్ళీ పేరు మార్చుకోనక్కర్లేదు అలా ఉంది సినిమా అన్నారు. అంతే నేను అన్న మాట ఒక్కటి కూడా వెనక్కి తీసుకోను అంతే..

రాజు గారితో రిలీజ్ పై ప్రెజర్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఓటిటి లో చెయ్యాల్సి వస్తుందనగా?

అది ప్రెజర్ అని కాదు కానీ నన్ను నమ్ముకొని చాలా మంది వచ్చారు. డైరెక్టర్, డీఓపీ ఇలా అందరూ కూడా, నేను సినిమా చూసుకొని నాకు నచ్చకపోతే నేనే ఏమి అనను కానీ సినిమా చూసాక చాలా బాగా బాగా వచ్చింది కానీ దీనిని ఒక టీవీ మీద ఒకడినే చూసుకుంటే బాగోదు అందుకే థియేటర్స్ లోనే రిలీజ్ చూపించాలని రాజు గారిని ప్రెజర్ చేసి అడిగాను.. రేపు థియేటర్స్ లో చూస్తేనే తెలుస్తుంది ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం అన్నది.

లాస్ట్ మీ ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలతో ఇది ఎలా ఉంటుంది? ఎమోషన్స్ వాటికన్నా తక్కువే కనిపిస్తున్నాయ్

ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయ్ ఫస్ట్ హాఫ్ అంతా నవ్వకుండా ఉండలేరు సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. అదే ట్రైలర్ లో లాస్ట్ 30 సెకండ్స్ పెట్టాం. ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ గా ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా ప్రివ్యూ చూసినవాళ్లు కూడా చాలా మంచి రెస్పాన్స్ నాకు ఇచ్చారు.

మీ సినిమా టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి మథర్ సెంటిమెంట్ అంటున్నారు ‘పాగల్’ అని ఉంది?

దానికి ఏంటంటే సినిమా ఒక ప్రేమ కథ అని చెప్పను ప్రేమ గురించి చెప్పే అద్భుతమైన కథ అని చెప్తా. తన తల్లి అందించిన ప్రేమ మళ్ళీ దొరుకుంతుందా అని పిచ్చిగా ఎదురు చూసే ఒక కుర్రాడి స్టోరీ లాంటిది..

మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీ మీద అటాక్ చేస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా?

నేనెప్పుడూ అలా అనుకోలేదు కానీ కా సినిమాలకు మరీ పర్సనల్ గా రాయొద్దు అని చెప్తా.. ఇప్పుడు “ఈ నగరానికి ఏమైంది” సినిమాకి రేటింగ్ 2 ఇచ్చారు కానీ అది అంత తక్కువ రేంజ్ సినిమా కాదని నా ఒపీనియన్ ఇప్పటికీ కూడా కోట్లల్లో ఈ సినిమా చూసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఫలక్ నామా దాస్ కి మ్యూజిక్ నే బాలేదు అన్నారు కానీ సినిమాలో మ్యూజిక్ నే చాలా బాగుంటుంది అలాంటివి రాయొద్దు నామీద అని నేను చెప్పేది..

మరి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రెజెంట్ దిల్ రాజు గారు, పీవీపీ గారితో ఓ సినిమా చేస్తున్న అది కూడా 70 పర్సెంట్ అయ్యిపోయింది. అలాగే అదీ మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమానే.. దాని తర్వాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ గారితో ఓ సినిమా కూడా ఉంది..

 

సంబంధిత సమాచారం :