నలుగురు స్ట్రేంజర్స్ వన్ డెస్టినీతో .. రేపే గ్రాండ్ ఓపెనింగ్ !

Published on Feb 26, 2020 12:21 am IST

గురు పవన్ దర్శకత్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రులుగా ఓ కొత్త సినిమా రూపొందనుంది. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్ నెం .1గా రాబోతున్న ఈ సినిమా రేపు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో 9 గంటలకు ఘనంగా లాంచ్ కానుంది. నలుగురు స్ట్రేంజర్స్ వన్ డెస్టినీతో 3450 కి.మీ రైడ్ చేస్తే.. ఆ తరువాత జరిగే నాటకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశాలు చుట్టూ ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

కాగా తమ సినిమా రేపు లాంచ్ అవ్వబోతుందని చిత్రబృందం నేడు అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. అన్నట్టు ఈ సినిమాకి రచన – దర్శకత్వం గురు పవనే. ఇక ఈ సినిమాని నిర్మాత జి మహేష్ నిర్మిస్తున్నారు. సునీల్ కష్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. రామ్ ప్రసాద్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :