తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తన తొలి చిత్రమే ‘డిసి’. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వామికా గబ్బి, సంజనలు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది కానీ అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఏర్పడలేదు.

ఇలానే తెలుగు సహా తమిళ్ మార్కెట్ లో విడుదల అయ్యిన ఈ సినిమా థియేటర్స్ లో ఆడియెన్స్ కి షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చి తమ సినిమాలోకి ఆడియెన్స్ ని లీనం చేసేసింది. తెలుగు, తమిళ్ లో ఒకే పాజిటివ్ టాక్ రావడం బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది ఈ చిత్రానికి. దీనితో డే 2 బుకింగ్స్ లో ర్యాంపేజ్ స్టార్ట్ అయ్యింది.

ఇప్పుడు గంటకి 15 వేలకి పైగా టికెట్ సేల్స్ తో భారీ జంప్ ని ఈ సినిమా డే 1 తో పోలిస్తే అందుకుంది. సో ముందు ముందు ఈ సినిమా పెద్ద హిట్టే అయ్యేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ మ్యాజికల్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version