ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర సంచలన విజయం సాధించిన చిత్రాల్లో రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో ధురందర్ 2 భాగాల కోసం అందరికీ తెలిసిందే. ఊహించని రికార్డు వసూళ్లు ఈ రెండు సినిమాలు సాధించాయి. అయితే ఈ సినిమా దెబ్బకు బాలీవుడ్ లో అనేకమంది స్టార్ హీరోల కెరీర్ రికార్డులకే ఎసరు పడింది.
అలా సంచలనం సెట్ చేసిన ఈ సినిమాల విషయంలో బాలీవుడ్ ఖాన్ హీరోస్ మాత్రం ఎలాంటి స్పందన చూపకపోవడం ఒకింత ఆసక్తిగా మారింది. తమ రికార్డులు బద్దలయ్యాయి అనే ఒక ఇన్ సెక్యూరిటీ తోనే ఏ ఖాన్ హీరో ఈ సినిమాలపై స్పందించలేదు అనే టాక్ కూడా ఉంది. కానీ ఫైనల్ గా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ధురందర్ సినిమాలపై లేటెస్ట్ గా సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడ్డం జరిగింది.
ఓ ఫాలోవర్ ధురందర్ సినిమా చూసారా అనే ప్రశ్నకు షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు కూడా చూశానని. రెండు సినిమాలు చాలా నచ్చాయి, చిత్ర యూనిట్ ఫెంటాస్టిక్ గా వర్క్ చేసారని బదులిచ్చారు. దీనితో చాలా కాలంగా కొందరి మదిలో ఉన్న ప్రశ్నకి ఇపుడు సమాధానం దొరికింది అని చెప్పొచ్చు. కానీ అంత నచ్చినప్పుడు అదేదో అప్పుడే ఓ పోస్ట్ చేసేసి ఉంటే షారుఖ్ పై ఆ కామెంట్స్ కూడా వచ్చి ఉండేవి కాదు.
He is too sweet and kind everytime we have met. Bless him https://t.co/ELL7YLvJui
— Shah Rukh Khan (@iamsrk) September 15, 2026
