కింగ్ నాగార్జున కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ సరికొత్త రూపంలో మళ్లీ థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సంచలన చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రీ-మాస్టరింగ్ చేసి, 4K వర్షన్‌లో ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయబోతున్నారు.
నాగార్జున పుట్టినరోజు మరియు రాఖీ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రేమకావ్యాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రానికి ఇళయరాజా అందించిన సంగీతం, మణిరత్నం టేకింగ్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్.
నాగార్జున, గిరిజల నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ క్లాసిక్‌ని మరింత మెరుగైన విజువల్స్, రిచ్ కలర్స్ మరియు అదిరిపోయే సౌండ్‌తో 4K వర్షన్‌లో బిగ్ స్క్రీన్‌పై తీసుకువస్తుండటంతో నాటి అభిమానులకు నోస్టాల్జియా ఫీలింగ్‌ను అందించడమే కాకుండా, నేటి తరం ప్రేక్షకులకు కూడా ఒక గొప్ప అనుభూతిని ఇవ్వనుంది.
