సమంత ‘యు టర్న్’ ఆరోజే రానుంది !

సమంత ‘యు టర్న్’ ఆరోజే రానుంది !

Published on Jul 22, 2018 2:06 PM IST

ఈ ఏడాది ‘రంగస్థలం , మహానటి , అభిమన్యుడు’ తో వరుస విజయాలను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని. ఇక ఆమె ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈచిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకే సారి విడుదల కానుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు