మెగా అభిమానులు ఈ ఏడాది ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం..మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ..చిరంజీవి నటించనున్న 150వ సినిమా ఈ ఏడాది మొదలు కానుందని తెలియగానే వారి ఆనందానికి అవధుల్లేవు. అంతే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరు 150వ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్నాడని తెలియడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేయడమే కాకుండా చిరు బర్త్ డే కానుకగా ఈ సినిమాని ప్రారంభించాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత సైలైంట్ అయిపోయారు. చిరు బర్త్ డే దగ్గర పడుతున్న కొద్దీ 150వ సినిమాపై క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో సస్పెన్స్ పెరిగిపోయింది.
కానీ చిరంజీవి తన 150వ సినిమాపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆయన బర్త్ డే కానుకగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన 150వ సినిమా గురించి చెప్పారు. ‘పూరి జగన్నాధ్ తో సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాక పూరి స్టొరీ లైన్ చెప్పి అది నచ్చడంతో డెవలప్ చేసాడు. ఫస్ట్ హాఫ్ చేలా బాగా నచ్చింది. కానీ సెకండాఫ్ పరంగా ఇంకాస్త బెటర్ గా ఉంటె బాగుండేది అనిపించింది. అదే టైములో పూరి మరో సినిమాతో బిజీ అవ్వడం వల్ల అది కాస్త పక్కకి వెళ్ళింది. ప్రస్తుతం రెండు కథలు చర్చల దశలో ఉన్నాయి. వాటిలో ఏది ఫైనలైజ్ అయినా మరో రెండు మూడు నెలలలో నా 150వ సినిమా మొదలైపోతుంది. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఆ సినిమాపైనే ఉందని’ చిరు తెలిపారు.
ఈ విషయంపై క్లారిటీ రావడంతో చిరు బర్త్ డే రోజున మూవీ స్టార్ట్ కాకపోయినా, చిరు అభిమానులను మెప్పించే కథ కోసం చూస్తున్నాడు అని తెలియగానే వారు హ్యాపీగా ఫీలయ్యారు.
