
ప్రతీభావంతుడైన యునటుడు శర్వానంద్ ‘రన్ రాజా రన్’ అనే ఒక యాక్షన్ కామెడీలో నటిస్తున్నాడు . తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో రేపు విడుదల కానుంది. ఈ ఆడియో రిలీజ్ కి సూపర్ స్టార్స్ ప్రభాస్ గోపీచంద్ హాజరు కానున్నారు.
గతంలో ‘మిర్చి’ చిత్రాన్ని నిర్మించిన వంశీ మరియు ప్రమోద్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై ‘రన్ రాజా రన్’ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ఒక మోసగాడి పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా వెల్లడి కావాల్సివుంది.
సీరత్ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.