టాలివుడ్ లో “కళావతి” మరో రికార్డ్!

టాలివుడ్ లో “కళావతి” మరో రికార్డ్!

Published on Feb 16, 2022 3:00 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం లో సూపర్ స్టైలిష్ గా మరియు మాస్ గా కనిపింబోతున్నాడు. ఈ చిత్రం లో మహేష్ సరసన హీరోయిన్ గా మొదటి సారి కీర్తి సురేష్ నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లకు సెన్సేషన్ రెస్పాన్స్ రాగా, ఇటీవల కళావతి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ పాటకు 22 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అదే విధంగా 1 మిలియన్ లైక్స్ తో దూసుకు పోతుంది. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ సాధించిన సాంగ్ గా ఈ వీడియో ఉండటం విశేషం. ఈ చిత్రం ను మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు