వన్ మిలియన్ లైక్స్ సాధించిన తలపథీ విజయ్ సాంగ్!

Published on Oct 6, 2021 11:28 am IST

విజయ్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బిగిల్. ఈ చిత్రం సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. AGS ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని కల్పతి ఎస్. అఘోరం నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ చిత్రం లోని వెర్రితనం పాట ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పాట ఇప్పటి వరకు 130 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ వీడియో సాంగ్ 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం లో జాకీ ష్రాఫ్, వివేక్, కథిర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు లో సైతం డబ్ అయి సూపర్ హిట్ విజయం సాధించింది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :