ఫన్ ఎంటర్ టైనర్ “అనుభవించు రాజా” టీజర్ కి గుడ్ రెస్పాన్స్!

Published on Sep 24, 2021 3:08 pm IST

రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గావిరెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అనుభవించు రాజా. S చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ ఎల్ పి పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరిగింది.

సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ ఫన్ ఎంటర్ టైనర్ గా ఉండటం తో సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :