ట్రెండ్ అవుతోన్న “మధుర నగరిలో” లిరికల్ సాంగ్!

Published on Sep 30, 2021 4:43 pm IST

రోషన్ మరియు శ్రీ లీలా జంటగా గౌరీ రొనంకి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రం ను థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల అయిన మధుర నగరి లో పాటకి సోషల్ మీడియా లో మంచి స్పందన వస్తోంది. ఈ పాట ఇప్పటి వరకు వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను మాస్ మహారాజా రవితేజ నిన్న విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

సోషల్ మీడియాలో సైతం ఈ పాటకి విశేష ఆదరణ వస్తోంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంతేకాక దిగ్గజ దర్శకులు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను తీసుకున్నారు. ఆర్కే ఫిలిమ్స్ అసోసియేట్స్ మరియు ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మాధవి కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సునీల్ కుమార్ నామా డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :