ఆల్ టైమ్ సౌత్ ఇండియా రికార్డు కొల్లగొట్టిన బన్నీ..!

Published on Oct 29, 2021 9:14 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైస్ పేరిట ఈ డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ చిత్రం తోలి సారిగా పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల అయిన సామీ సామీ లిరికల్ వీడియో సౌత్ నాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అటు యూ ట్యూబ్ లో ఒక్క రోజు లోనే 10.2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఆల్ టైమ్ సౌత్ ఇండియా రికార్డ్ ను కొల్లగొట్టడం జరిగింది. 436కే కి పైగా వ్యూస్ రావడం విశేషం.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More