కమల్ హాసన్ “విక్రమ్” ఫస్ట్ గ్లాన్స్ కి 10 మిలియన్ వ్యూస్!

Published on Nov 7, 2021 7:15 pm IST

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం విక్రమ్. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ గ్లాన్స్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ఇప్పటి వరకూ ఈ వీడియో యూ ట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గిరీష్ గంగరధన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కమల్ హాసన్ మరియు ఆర్. మహీంద్రన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మరియు ఫాహద్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విక్రమ్ ఫస్ట్ గ్లాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More