10 మిలియన్ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్

10 మిలియన్ వ్యూస్ తో టాప్ లో దూసుకు పోతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్

Published on Oct 3, 2021 9:54 PM IST

అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి. అంతేకాక తాజాగా విడుదల అయిన ట్రైలర్ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అంతేకాక యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఇంకా టాప్ లో కొనసాగుతూ ఉండటం విశేషం.

గీతా ఆర్ట్స్ 2 పతాకం పై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు