కోటి వ్యూస్ సాధించిన “ఈ రాతలే” లిరికల్ వీడియో!

Published on Nov 23, 2021 2:03 am IST


ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ను యూవీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ పతాకం పై భూషణ్ కుమార్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీద ఉప్పలపాటి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట కి ఇప్పటి వరకూ యూ ట్యూబ్ లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా లో ఇప్పటికే ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :