10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న “రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్!

Published on Nov 17, 2021 5:00 pm IST

ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం లో ప్రభాస్ పాత్ర కి సంబంధించిన వీడియో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ చిత్రం నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ రాతలే అంటూ సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ పాటకి 10 మిలియన్స్ కి వ్యూస్ వచ్చాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :