10 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “రావణాసుర” ట్రైలర్

Published on Mar 29, 2023 7:02 pm IST

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం లో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, మేఘా ఆకాష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేయగా, దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. మాస్ మహారాజా ఈ ట్రైలర్ లో డిఫెరెంట్ షేడ్స్ తో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :