టాప్ లో ట్రెండ్ అవుతోన్న సానా కష్టం సాంగ్!

టాప్ లో ట్రెండ్ అవుతోన్న సానా కష్టం సాంగ్!

Published on Jan 4, 2022 7:38 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మాట్నీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి సానా కష్టం పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెజీనా కాసాండ్రా మెగాస్టార్ తో ఈ పాటలో ఆడి పాడింది. ఈ పాటకి యూ ట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క రోజులో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించడం జరిగింది. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు