తేజ సజ్జ “అద్భుతం” కి భారీ రెస్పాన్స్!

Published on Nov 23, 2021 6:30 pm IST

తేజ సజ్జ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే తేజ సజ్జ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అద్భుతం. ఈ చిత్రం ను ఆన్లైన్ వేదిక గా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రం రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతుంది.

ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. కేవలం మూడు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వీక్షణలని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇంత సక్సెస్ సాధించడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్స్ తెలిపింది. ఈ చిత్రం కి ప్రశాంత్ వర్మ కథ అందించగా, రదన్ సంగీతం అందించారు. శివాని రాజశేఖర్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించగా, ఎస్ ఒరిజినల్స్ పతాకం పై ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More