కేజీఎఫ్ 2 సాంగ్స్ కి యూ ట్యూబ్ లో భారీ రెస్పాన్స్!

Published on Apr 15, 2022 8:06 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం లోని అన్ని పాటలకు, అన్ని బాషల్లో కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ రావడం విశేషం. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :