అనిల్ రావిపూడి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రం విడుదల అయి సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ను హిందీ లో డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ లో సుప్రీమ్ ఖిలాడి పేరిట విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం తాజాగా యూ ట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో సాయి ధరమ్ తేజ్ ట్యాక్సీ డ్రైవర్ గా నటించారు. ఈ చిత్రం హిందీ లో 100 మిలియన్ వ్యూస్ రావడం పట్ల ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
